The RajaSaab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. తాజాగా కలెక్షన్లకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ‘ది రాజాసాబ్’ మొదటి రోజు గ్రాస్ రూ.112 కోట్లు వసూలు చేసింది. ఇది హర్రర్ మూవీ జానర్ లో వచ్చిన అత్యధిక కలెక్షన్లు. ఈ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది. ప్రభాస్ రీసెంట్ సినిమాలను చూసుకుంటే.. ఇది తక్కువే అయినప్పటికీ ఈ జానర్ లో మంచి టాక్ అందుకున్న సినిమాగా ‘ది రాజాసాబ్’ నిలబడింది. దీనిని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Sanjay Dutt: మూడు రూ. 1000 కోట్ల చిత్రాలున్న ఏకైక ఇండియన్ యాక్టర్.. ‘రాజా సాబ్’ మిస్!
రాజా సాబ్ అలియాస్ రాజు (ప్రభాస్) తన నానమ్మ గంగమ్మ (జరీనా వహాబ్)తో కలిసి సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. మతిమరుపు ఉన్న నానమ్మ కోరిక మేరకు, తన తాత కనకరాజు (సంజయ్ దత్)ని వెతుకుతూ రాజు నర్సాపూర్ అడవుల్లోని ఒక పాత రాజమహల్‌కి చేరుకుంటాడు. అయితే ఆ కోట కేవలం కట్టడం మాత్రమే కాదు, అది రహస్యాలు క్షుద్ర శక్తులకు నిలయం. అక్కడ రాజుకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు కనకరాజు ఎవరు? ఈ ప్రయాణంలో రాజుకు తోడైన ముగ్గురు భామల పాత్ర ఏంటి? అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
Read also-The Raja Saab: అభిమానుల అత్యుత్సాహం.. ‘రాజా సాబ్’ థియేటర్లో మంటలు
ముందు నుంచీ చెబుతున్నట్లు ఈ సినిమా ప్రభాస్ కామెడీ టైమింగ్ ను మరో సారి బయటకు తీస్తుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ చేశారు. కామెడీ మాత్రమే కాకుండా డ్యాన్స్‌లతో కూడా ఫ్యాన్స్‌ను అలరించారు. ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’, ‘చక్రం’ కాలం నాటి ఎనర్జీని మళ్ళీ చూపించారు. దీంతో ప్రేక్షకులకు వింటేజ్ ప్రభాస్ ను చూసే అవకాశం దక్కింది. ఫ్యాన్ అయితే ప్రభాస్ అలా చూసి సంబరాలు చేసుకుంటున్నారు. క్లైమాక్స్ లో అయితే ప్రభాస్ నట విశ్వ రూపం చూస్తారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ప్రధాన హీరోయిన్ అనుకున్న నిధి అగర్వాలా దాదాపు పాటలకే పరిమితం అవుతుంది. మాళవిక మోహన్ దాదాపు సినిమా మొత్తం కనిపిస్తుంది. ఇక మూడో హీరోయిన్ పాత్రకు కథలో అంత ప్రాధాన్యత కనిపించలేదు. తాత పాత్రలో (కనకరాజు) సంజయ్ దత్ అయితే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక నానమ్మ పాత్ర చేసిన జరీనా వాహబ్ గురించి ప్రభాస్ చెప్పినట్లు సెకండ్ హీరో. సముద్రఖని, బొమన్ ఇరానీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక కామెడీ కోసం తీసుకున్న సప్తగిరి, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను తమ పాత్రలకు న్యాయం చేశారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) కొన్ని హారర్ సీన్లలో బాగా వర్కవుట్ అయింది. పాటలు కూడా విజువల్‌గా చాలా బాగున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే మొసలి ఫైట్, చివరి 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్స్ వీఎఫ్ఎక్స్ పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కార్తిక్ పళని సినిమాను చాలా కలర్ ఫుల్ గా చూపించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఆకట్టుకునేలా ఉంటుంది. టెక్నికల్ గా అందరూ తమ సామర్థ్యాలు మొత్తం చూపించారు.
A new benchmark has been set with KING SIZE BOX OFFICE domination across every fort 🔥🔥#TheRajaSaab 𝐃𝐚𝐲 𝟏 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐬𝐭𝐚𝐧𝐝𝐬 𝐚𝐭 𝟏𝟏𝟐𝐂𝐫+ 💥
Biggest start ever for a horror fantasy film ❤️🔥#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi… pic.twitter.com/Ju71XCpMsf
— People Media Factory (@peoplemediafcy) January 10, 2026

