The Raja Saab: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ‘రాజా సాబ్’ థియేటర్లో ఫైర్
Fire in Raja Saab Theater (image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: అభిమానుల అత్యుత్సాహం.. ‘రాజా సాబ్’ థియేటర్లో మంటలు

The Raja Saab: అభిమానించే హీరో సినిమా విడుదలవుతుంటే అభిమానం చూపించాలని అభిమానులందరికీ ఉంటుంది. అది అభిమానంగానే ఉండాలి తప్పితే.. అత్యుత్సాహంగా ఉండకూడదు. అభిమానులు చేసే కొన్ని పనులు ఆయా హీరోలకు కొన్నిసార్లు ఇబ్బందులు కలిగిస్తాయనే విషయం తెలియంది కాదు. మరీ ముఖ్యంగా రీ రిలీజ్ కల్చర్ వచ్చగా, అభిమానం కాస్త హద్దులు దాటుతుంది. అంతకు ముందు లేదా అంటే, ఉంది కానీ, ఈ స్థాయిలో లేదనే చెప్పాలి. హీరోని అభిమానించు పరవాలేదు. కానీ, అత్యుత్సాహం ప్రదర్శిస్తేనే కొంపలంటుకుంటాయి. ఇక్కడ కొంపలు కాదు కానీ, ఒక థియేటర్ బూడిదయ్యేది.. జస్ట్ మిస్ అంతే. అంతగా అభిమానులు ఏం చేశారని అనుకుంటున్నారా? ఈ మధ్య చాలా అంటే చాలానే ఇస్తున్నారు.

Also Read- MSG Ticket Price: చిరు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరల హైక్, ప్రీమియర్ వివరాలివే!

అభిమానుల అత్యుత్సాహం

అభిమానించే హీరో సినిమా విడుదలవుతుంటే.. పబ్లిగ్గా పొట్టేళ్ల తలకాయలు నరకడం, గ్రూపుగా చేరి డ్యాన్సులు చేయడం, ఇతర ప్రేక్షకులకు ఇబ్బందిని కలిగించడం.. ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడీ జాబితాలోకి రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్ కూడా చేరారు. ఇంతకీ వారు ఏం చేశారని అనుకుంటున్నారా? థియేటర్లలో బాణ సంచా కాల్చారు. రీ రిలీజ్ ట్రెండ్‌లో అందరూ చేస్తుంది ఇదేగా? అని డౌట్ రావచ్చు. అప్పట్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ఒకటి రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో ఇలానే బాణసంచా కాలిస్తే స్క్రీన్ కాలిపోయింది. థియేటర్ చాలా వరకు తగలబడింది. అప్పటి నుంచి ఫ్యాన్స్‌ని తెరముందుకు రాకుండా థియేటర్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పని కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. కాకపోతే.. థియేటర్ యాజమాన్యం, ప్రేక్షకులు అలెర్ట్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Also Read- Purushaha Teaser: ‘పెద్ది’ దర్శకుడు వదిలిన ‘పురుష:’ టీజర్.. పొట్ట చెక్కలవ్వాల్సిందే!

రాజా సాబ్ థియేటర్లో మంటలు

అసలు విషయంలోకి వస్తే.. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) రిలీజ్ సందర్భంగా ఒడిశాలోని రాయగడలో ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్ లోపల బాణసంచా కాల్చడంతో.. నిప్పురవ్వలు ముందున్న కాగితాలపై పడి మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు పరుగులు పెట్టారు. కానీ కొందరు ప్రేక్షకులు ధైర్యం చేసి, థియేటర్ టీమ్‌తో కలిసి మంటలను ఆర్పడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మంటల్లో స్క్రీన్‌కు గానీ, సీట్స్‌కు గానీ మంటలు అంటుకోలేదు. అదే జరిగి ఉంటే ఊహించని ప్రమాధం సంభవించి ఉండేది. థియేటర్ ప్రేక్షకులతో ఫుల్‌గా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. వెంటనే చెలరేగిన మంటలను ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత ఫ్యాన్స్‌పై ప్రేక్షకులు ఫైర్ అయినట్లుగా సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Meenakshi Natarajan: సర్పంచ్ ఎన్నికలపై మీనాక్షి స్క్రీనింగ్.. మున్సిపోల్‌కు ముందస్తు జాగ్రత్తలు!

Rajaiah Slams Kadiyam Srihari: నా అభివృద్ధి నీ ఖాతాలో వేసుకుంటావా? కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్!

Telangana Secretariat: ఇష్టారాజ్యంగా స్ట్రీట్ వెండర్ల కార్యకలాపాలు.. సదరు నేతకు ఓ కేంద్ర మంత్రి అండ దండలు.. ఎవరా నేత?

Sankranti Traffic: సంక్రాంతి ఎఫెక్ట్.. రద్దీగా హైదరాబాద్ – విజయవాడ హైవే.. భారీగా ట్రాఫిక్ జామ్!

GHMC Commissioner: గ్రేటర్‌ను పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చాలి.. రంగంలోకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్!