Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రంలో ఆయన చేసిన పాత్రకు ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్నా, బాలీవుడ్ నటులైన జరీనా వాహబ్, సంజయ్ దత్ పాత్రలకు, వారి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, వీరి ప్రభావంతో నార్త్‌లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఆ ప్రభావం కలెక్షన్స్‌కు ఎంతగా యూజ్ అవుతుందనేది మాత్రం చూడాల్సి ఉంది. మొదటి నుంచి ఈ సినిమాపై ఉన్న అంచనాలను కనుక రీచ్ అయ్యేలా కంటెంట్ ఉండి ఉంటే మాత్రం, సంజయ్ దత్ అకౌంట్‌లో మరో రూ. 1000 కోట్ల ఫిల్మ్ చేరేదని ఇప్పుడంతా అనుకుంటూ ఉండటం విశేషం. అవును.. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడు రూ. 1000 కోట్లు ఉన్న సినిమాలు కేవలం సంజయ్ దత్‌కు మాత్రమే ఉన్నాయి.
Also Read- Pawan Kalyan: హైపర్ ఆదిని సత్కరించిన పవన్ కళ్యాణ్.. విషయం ఏంటంటే?
మంచి ఛాన్స్ మిస్సయింది
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా కూడా విడుదలకు ముందు రూ. వెయ్యి కోట్లు కొడుతుందనేలా అంచనాలున్నాయి. కానీ, ఈ సినిమాకు వచ్చిన టాక్ చూస్తే.. అది కష్టమే అనిపిస్తుంది. నిర్మాతకు పెట్టిన డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నార్త్‌లో నిలబడితే మాత్రం, నిర్మాత సేఫ్ జోన్‌లోకి చేరే అవకాశం ఉందనేలా రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణలో సాధారణ ధరలే ఉంటాయి కాబట్టి.. సినిమా ఎలా ఉన్నా, ప్రభాస్ సినిమా కాబట్టి, అందరూ థియేటర్లకు వచ్చి చూస్తారనేలా కూడా టాక్ వినిపిస్తోంది. ఎంత చూసినా, పండగకి భారీ పోటీ ఉంది కాబట్టి ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకోవడం కష్టమే. దీంతో సంజయ్ దత్‌కు మంచి ఛాన్స్ మిస్సయింది. లేదంటే ఆయన ఖాతాలో నాల్గవ రూ. వెయ్యి కోట్ల సినిమా చేరేది. ఆయన క్రేజ్ మరింతగా పెరిగేది.
Also Read- BMW Pre Release Event: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడంటే?
మూడు వెయ్యి కోట్లు కొట్టిన సినిమాలివే..
ఇంతకీ సంజయ్ దత్ అకౌంట్‌లో ఉన్న ఆ మూడు వెయ్యి కోట్ల సినిమాలు ఏంటని అనుకుంటున్నారా? 2022లో వచ్చిన రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజియఫ్ 2’ (KGF 2) సినిమాతో మొదటి వెయ్యి కోట్ల సినిమా అందుకున్న సంజయ్ దత్, ఆ మరుసటి సంవత్సరం వచ్చిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అట్లీ కాంబో మూవీ ‘జవాన్’ (Jawan)తో మరో రూ. వెయ్యి కోట్ల మూవీని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతోన్న రణ్వీర్ సింగ్, అదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘దురంధర్ పార్ట్ 1’ (Dhurandhar Part 1) చిత్రం. ‘కెజియఫ్’ సినిమా రూ. 1215 కోట్లు కలెక్ట్ చేస్తే, ‘జవాన్’ సినిమా రూ. 1160 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ‘దురంధర్ పార్ట్ 1’ చిత్రం రూ. 1220 ప్లస్ కోట్లను సాధించి స్టిల్ ఇంకా సునామీ సృష్టిస్తూనే ఉంది. ఈ మూడు సినిమాలలో సంజయ్ దత్ పాత్ర బాగా హైలెట్ అయిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

