Prabhas Interview: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరెకెక్కిన ‘ది రాజాసాబ్’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ఫుల్ ఇంటర్వ్యూ విడుదలైంది. ఇప్పటికే ఈ వీడియో నుంచి ప్రోమో విడుదలవ్వగా ఫుల్ వీడియో కోసం ఎదురు చూసిన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇందులో దర్శకుడు సందీప్, ప్రభాస్ లతో పాటు ముగ్గురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ వీడియో కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూశారు ప్రభాస్ అభిమానులు. ఈ వీడియోలో ప్రభాస్ సినిమా కోసం ఏమేమి చేయాల్సి వచ్చిందో, షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను సందీప్ తో పంచుకున్నారు. అంతే కాకుండా ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ తో మాట్లాడటానికి వారు చూసే ప్రయత్నాలు గురించి చెప్పుకొచ్చారు.
Read also-Anaganaga Oka Roju Trailer: ‘అనగనగా ఒక రాజు’ పండక్కి వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?
సినిమా గురించి చెబుతూ ప్రభాస్ ఏం అన్నారంటే?.. ది రాజాసాబ్ సినిమా హారర్, కామెడీ, రొమాంటిక్ ఫాంటసీ కలగలిసిన ఒక విభిన్నమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఈ సినిమాలో మొదటిసారిగా పూర్తిస్థాయి కామెడీ రోల్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రధానంగా ఒక నానమ్మ, మనవడి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది. సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్యగా నటిస్తున్నారు. ఆయనే ఈ కథలో ప్రధాన విలన్. ఆయన పాత్ర ఒక భయంకరమైన రాక్షసుడి రూపంలోకి మారుతుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముగ్గురూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read also-Celebrity Controversy: మరోసారి వైరల్ అవుతున్న అనసూయ వీడియో.. శివాజీని ఏం అన్నారంటే?
షూటింగ్ అనుభవాలు
దర్శకుడు మారుతి ఈ కథను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని, ముఖ్యంగా ఇందులోని ‘హిప్నాటిజం’ అంశం కొత్తగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు భారీ సెట్లు వేసి షూటింగ్ చేశారు. దీని గురించి చెబుతూ ప్రభాస్ ఆ ఇల్లు తనకు రెండో ఇంటిలా తయారయ్యిందని, ఈ ఏడాదిన్నర కాలం అక్కడే ఎక్కువ సేపు గడపాల్సి వచ్చిందన్నారు. థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ వేసుకోవడానికి అనుమతులు వచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రీమియర్, టికెట్ రేట్లు పెంచుకోవడంపై ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

