Celebrity Controversy: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన యాక్టర్ శివాజీ వ్యాఖ్యలు మరో సారి వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయం గురించి దాదాపు ప్రజలందరూ మర్చిపోతుంటే.. అనసూయ మాత్రం మరో వీడియో పెట్టి యాక్టర్ శివాజీ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో మరోసారి వైరల్ అవుతుంది. ఇంతకూ ఈ వీడియోలో ఏం అన్నరంటే.. తను అనారోగ్యానికి గురయ్యానని, టైప్ చేయడానికి ఓపిక లేక ఇలా వీడియో చేస్తున్నానని అన్నారు. అంతే కాకుండా.. యాక్టర్ శివాజీ జీవితంలో ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారని, మంచి పాత్రలు ఆయనకు అలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయన్నారు. అలాంటి వారు వేదికలపై నిలబడి ఏం చెప్పినా చాలా మంది వాటిని వింటారని, అందుకు చాలా పద్దతిగా మాట్లాడి ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన ఉద్ధేశం మంచిదే అయినా ఆ రెండు పదాలు అనకుండా ఉంటే బాగుండేదన్నారు.
Read also-The RajaSaab: మీడియా దెబ్బకు భయపడే స్టేజుకు వెళ్లిపోయా.. ‘ది రాజాసాబ్’ దర్శకుడు
అదే విధంగా.. అంత పెద్ద యాక్టర్ అంత పెద్ద వేదికపై ఆ రెండు మాటలు కాకుండా.. అదే సందర్భంలో మహిళల స్వేచ్ఛను వారికి ఇచ్చేసి, వారిని మనం కాపాడుకుంటే బాగుంటుంది. అని చెప్పి ఉంటే బాగుండేదని అనసూయ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు ఇలాంటి మాటలు ముందే అని ఉంటే బాగుండేది కదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే శివాజీ అలా అనడంపై పలువురు సెలబ్రిటీలు తమ దైర శైలిలో స్పందించారు. దీంతో ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
Read also-Yash Introduced as Raya: ‘టాక్సిక్’ నుంచి యష్ ఇంట్రడ్యూసింగ్ షాట్ చూశారా.. బాబోయ్ ఇది అరాచకమే..
శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు: అనసూయ
మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే: అనసూయ
కేవలం హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేది: అనసూయ pic.twitter.com/rfma0N7xCR
— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2026

