The RajaSaab: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా దర్శకుడు గత వారం రోజులుగా ఆ సినిమా ప్రమోషన్ల కోసం అస్ట కష్టాలు పడుతున్నారు. తెలిసీ తెలియని యూట్యూబ్ చానళ్లకు ప్రముఖ జర్నలిస్టులకు ఎవ్వరూ ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీనిని బట్టి చూస్తేనే తెలుస్తోంది, ఆయనకు సినిమాపై ఉన్న డెడికేషన్ ఏమిటో. తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మీడియా దెబ్బకు ఇంటర్వ్యూలు చేసీ, చేసీ మీడియా అంటే భయపడే స్థాయికి వెళ్లిపోయానంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా ‘ది రాజాసాబ్’ గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘ఈ రాజా సాబ్ భవంతి సెట్ దాదాపు ఏడాదిన్నర మాకు మరో ఇళ్లుగా మారింది. హారర్ ఫాంటసీ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాం. సినిమా చూశాను. తమన్ తన మ్యూజిక్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. అంటూ థమన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
Read also-Prabhas Interview: సందీప్ రెడ్డితో ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూ.. ఫుల్ వీడియో వచ్చేసింది..
అంతే కాకుండా.. హీరో క్యారెక్టర్ తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ మూవీలో చూస్తారు. ప్రభాస్ గారిని ఎలా చూడాలని మీరంతా అనుకున్నారో అలా ఈ సినిమాలో కనిపిస్తారు. రేపు ప్రీమియర్స్ పడుతున్నాయి. మీరు ఎంత ఎనర్జీతో సంతోషంతో థియేటర్ లోపలికి వెళ్తారో, అంతకంటే రెట్టింపు ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని బయటకు వస్తారు. సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు నన్ను నమ్మారు, ఆయనకు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాను. నేను యానిమేషన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. రాజా సాబ్ ఒక డిస్నీ మూవీలా ఉంటుంది. నాచె నాచె సాంగ్ ప్రభాస్ గారికి నాకు ఫేవరేట్ సాంగ్. కథలోని ఆ సిచ్యువేషన్ కు ఈ పాట బాగుంటుందని ముందే అనుకున్నాం. మూడేళ్లు మా దగ్గర ఉన్న సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసింది. ఇక మీరు మీ రెస్పాన్స్ ఇవ్వాలి. అంటూ తను దర్శకత్వం వహించిన సినిమా గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Yash Introduced as Raya: ‘టాక్సిక్’ నుంచి యష్ ఇంట్రడ్యూసింగ్ షాట్ చూశారా.. బాబోయ్ ఇది అరాచకమే..
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ‘రాజా సాబ్’ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న ‘ది రాజా సాబ్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

