Prabhas: టాలీవుడ్ బాహుబలి, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సౌత్ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ లెవల్లో ప్రభాస్ కటౌట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇంత భారీ ఇమేజ్ ఉన్న హీరోను సరిగ్గా హ్యాండిల్ చేయడం అందరి వల్ల కావడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి దిగ్గజ దర్శకులు ప్రభాస్‌లోని మాస్ అండ్ క్లాస్ యాంగిల్స్‌ను పర్ఫెక్ట్‌గా వెలికితీస్తుంటే, మిగిలిన వారు మాత్రం మంచి పీక్ స్టేజ్‌లో వచ్చిన ఆ భారీ కటౌట్‌ను చూసి తడబడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read- Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
ఆ నమ్మకమే కొంపముంచుతోందా?
ప్రభాస్ అంటేనే ఒక ‘డార్లింగ్’. తనతో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ఇచ్చే గౌరవం, తోటి దర్శకులపై ఆయనకు ఉండే నమ్మకం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్‌పై ఉన్న ప్రేమతో, తన స్నేహితుల కోసమో లేదా చిన్న దర్శకులకు లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనో ప్రభాస్ వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. కానీ, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో దర్శకులు విఫలమవుతున్నారనేది వాస్తవం. రాధాకృష్ణ కుమార్‌కు ‘రాధే శ్యామ్’ వంటి భారీ పీరియడ్ డ్రామా ఇచ్చినా, ఆ అద్భుతమైన కటౌట్‌ను కేవలం ప్రేమికుడి పాత్రకే పరిమితం చేసి, ఆయన మాస్ ఇమేజ్‌ని అస్సలు వాడలేకపోయారనే విమర్శ ఉంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అయితే ‘ఆదిపురుష్’తో ప్రభాస్ ఫ్యాన్స్‌ను, ప్రభాస్‌ను నిలువునా ముంచేశారనే చెప్పాలి. గ్రాఫిక్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా ప్రభాస్ రేంజ్‌కు తగ్గ అవుట్‌పుట్ ఇవ్వడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు.
Also Read- Nayanthara: ఒక సామ్రాజ్యమే.. నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న మారుతి
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. మారుతి వంటి దర్శకుడికి ప్రభాస్ కాల్షీట్స్ ఇవ్వడమే ఒక అద్భుతం. నిజానికి ప్రభాస్ రేంజ్‌కు మారుతి వంటి దర్శకుడికి అవకాశం దక్కడం అనేది లైఫ్ టైం అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. అయితే, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల చర్చలు నడుస్తూ వచ్చాయి. ప్రభాస్ మార్కెట్‌కు మారుతి న్యాయం చేయగలరా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడా ప్రశ్నలే నిజమయ్యాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుని, ప్రభాస్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న మాటే నిజమైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కటౌట్‌ని వాడుకోవడం అంటే కేవలం ఫైట్లు, భారీ డైలాగులు మాత్రమే కాదు.. ఆయనకున్న ఇంటర్నేషనల్ ఇమేజ్‌ని, స్క్రీన్ ప్రెజెన్స్‌ని కథలో లీనం చేయడం కూడా తెలిసుండాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి వారు చేసిన మ్యాజిక్ ఇతరులు ఎందుకు చేయలేకపోతున్నారనేది దర్శకులు ఆలోచించుకోవాల్సిన విషయం. డార్లింగ్ ఇచ్చే అవకాశాన్ని ‘అదృష్టం’గా భావించడమే కాకుండా, బాధ్యతగా తీసుకుంటేనే ఆ కటౌట్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుందని ఇప్పటికైనా మన దర్శకులు తెలుసుకుంటే మంచిది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

