Nayanthara: నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..
Nayanthara Assets (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Nayanthara: ఒక సామ్రాజ్యమే.. నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..

Nayanthara: నయనతార.. ఈ పేరు తెలియని వారుండరు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఆమె అందరికీ పరిచయమే. ప్రస్తుతం నయనతార ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నయనతార (Nayanthara)కు చెన్నైలో రెండు ప్రధానమైన ఆస్తులు ఉన్నాయని.. ఇవి రెండూ సౌత్ ఇండియాలోనే అత్యంత ఖరీదైనవి కావడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) వంటి దిగ్గజాలు నివసించే పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో నయనతారకు 16,500 చదరపు అడుగుల భారీ ప్యాలెస్ ఉంది. దాదాపు రూ. 100 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని ఆమె తన కుటుంబంతో కలిసి నివసించే ప్రైవేట్ రిట్రీట్‌గా వాడుతున్నారు. ఇందులో హోమ్ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని ఆధునిక వసతులు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ వివరాలివే..

పోయెస్ గార్గెన్‌లో రూ. 100 కోట్ల విలువ చేసే ఇల్లు

అలాగే అల్వార్‌పేటలోని ప్రశాంతమైన వీనస్ కాలనీలో ఆమెకు 7,000 చదరపు అడుగుల వింటేజ్ బంగ్లా ఉంది. దీనిని నయన్, ఆమె భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) తమ హోమ్ ఆఫీస్, క్రియేటివ్ స్టూడియోగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండు కూడా ఓల్డ్ వరల్డ్ చార్మ్, మినిమలిస్ట్ మోడర్నిజం కలయికతో ఉంటాయని.. వీనస్ కాలనీ ఆఫీసులో ఎర్త్ కలర్ ప్యాలెట్, రతన్ కుర్చీలు వంటివి స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండగా.. పోయెస్ గార్డెన్ ఇల్లు మాత్రం అచ్చం ఆధునిక హంగులతో ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్, ఫ్యామిలీ ఫోటో వాల్స్, యోగా కోసం ప్రత్యేకమైన బాల్కనీలు ఇక్కడ ప్రత్యేకం.

Also Read- Allu Aravind: ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’పై మాస్టర్ మైండ్ స్పందనిదే..

నయన్ ఆస్తుల విలువ ఎంతంటే..

2026 నాటికి నయనతార రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం విలువ భారీగా పెరిగింది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఒక్కొక్కటి రూ. 15 కోట్ల విలువైన రెండు ఇళ్లు, ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ ఆమెకు ఉన్నాయి. ఆమె రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ రూ. 100 నుంచి రూ. 120 కోట్ల మధ్య ఉంటుంది. సినిమాల విషయానికి వస్తే.. ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లపైన రెమ్యునరేషన్, ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్, ‘ఫెమి9’, ‘9Skin’ వంటి బిజినెస్‌లతో కలిపి ఆమె మొత్తం ఆస్తి నెట్ విలువ రూ. 200 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. నయనతార కేవలం ఇళ్లతోనే ఆగలేదు. ఆమె వద్ద రూ. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, ఇంకా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నయనతార, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అత్యంత సంపన్నమైన సెల్ఫ్ మేడ్ మహిళల్లో ఒకరిగా నిలిచారు. మొత్తంగా చూస్తే.. నయనతార సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా ‘లేడీ సూపర్ స్టార్’ అని నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nenu Ready Teaser: 30 వేల జీతానికి ఇలాంటి దరిద్రపుగొట్టు జాబ్ ఎవడైనా చేస్తాడా?

Bhatti Vikramarka: వారికి గుడ్ న్యూస్.. జంట పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

CM Revanth Reddy: త్వరలో ఈ కొత్త రూల్‌.. చలానా పడిందా? మీ ఖాతా నుంచి పైసలు కట్.. సీఎం రేవంత్ రెడ్డి !

Sharwanand: ‘శతమానం భవతి’.. ఆత్రేయపురంలో ‘నారీ నారీ నడుమ మురారి’!

Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!