Peddi vs Ram Bujji
ఎంటర్‌టైన్మెంట్

Peddi: ‘పెద్ది’లో రామ్‌ బుజ్జిగా ‘మీర్జాపూర్’ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?

Peddi: ‘గేమ్ చేంజర్’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్‌గా గుర్తింపు పొందిన బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన  ఫస్ట్ షాట్ గ్లింప్స్ దేశవ్యాప్తంగా సినిమాపై హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీమ్‌తో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి రెడీ అవుతోంది. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ (divyendu sharma) ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. తాజాగా దివ్యేందు శర్మ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయనకు విషెస్ చెబుతూ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్‌ని గురువారం విడుదల చేసింది.

Also Read- Bigg Boss Couple: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. తిరుమలలో బిగ్ బాస్ జంట.. పెళ్లి చేసుకోవడానికే వెళ్ళారా?

ఈ పోస్టర్‌లో ‘పెద్ది’ సినిమాలో ‘రామ్ బుజ్జి’ పాత్రలో దివ్యేందు శర్మ నటించబోతున్నట్లుగా ప్రకటించారు. క్రికెట్ బంతిని ఎగరేస్తూ.. ఇంటెన్స్ లుక్‌లో మీర్జాపూర్ నటుడు ఇందులో కనిపిస్తున్నారు. దివ్యేందు శర్మను ‘రామ్‌ బుజ్జి’గా పరిచయం చేసిన పోస్టర్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. పెద్దిలో ఆయన పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని ఈ సందర్భంగా మేకర్స్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ‘పెద్ది’ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ వివరాలకు వస్తే.. హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని, సినిమాకే హైలైట్‌గా ఉంటుందని చిత్ర బృందం తెలుపుతోంది.

Also Read- Samantha: నాగ చైతన్యను సమంత మర్చిపోలేకపోతోందా? బయట పడిన రహస్యం?

‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్ చేస్తున్న రెండో తెలుగు చిత్రమిది. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఆమె స్థిరపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా చిత్రయూనిట్ మాట్లాడుకుంటోంది. ఇంకా కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ జగపతి బాబు ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు