Peddi First Shot: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ చిన్నపాటి గ్లింప్స్‌ని కూడా వదిలారు. ‘పెద్ది ఫస్ట్ షాట్’ పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతుంది. కారణం, ఇందులో రామ్ చరణ్ క్రికెట్ ప్లేయర్‌గా కనిపించడం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటం. ఐపీఎల్ టీమ్స్‌కి ఈ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ తెగ నచ్చేసింది. ఈ షాట్‌ని వారు రీ క్రియేట్ చేసి, టీమ్‌కి చెందిన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ పేజీలలో పోస్ట్ చేస్తున్నారు.
Also Read- Balakrishna: ఇంతకీ బాలయ్య ఆ మాట అంది చిరంజీవినా? హరికృష్ణనా?
తాజాగా ‘పెద్ది ఫస్ట్ షాట్’ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్లేయర్స్ రీ క్రియేట్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ వీడియోలోని లాస్ట్ షాట్‌ని సేమ్ టు సేమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ దించేయడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ రిజ్వీ సమీర్ ఆ సిగ్నేచర్ షాట్‌తో ‘పెద్ది’ టీమ్ కూడా ఆశ్చర్యపోయింది. వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ వీడియోని పోస్ట్ చేసి టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు కూడా వావ్ అనిపించే రేంజ్‌లో ఈ వీడియో ఉందంటే, దీని కోసం వారు ఎంతగా ట్రై చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అందుకే వెంటనే రామ్ చరణ్, బుచ్చిబాబు సానా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ, ఎంతగానో మురిసిపోయారు. మళ్లీ ఎక్కడ హైదరాబాద్ టీమ్, ఫ్యాన్స్ దీనిని నెగిటివ్‌గా తీసుకుని ట్రోల్ చేస్తారో అని, సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) టీమ్‌ని కూడా ప్రస్తావిస్తూ, వారు మళ్లీ ఫామ్‌లోకి వస్తారనేలా పేర్కొన్నారు. ప్రస్తుతం వారి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
Thank you ❤️ @DelhiCapitals for the Massive Recreation of #PeddiFirstShot ❤️🔥🏏
Wishing you all the best for today’s Match 🤝
Just be prepared @SunRisers might comeback stronger.😃💪🏼 pic.twitter.com/4s7qQNmqGW
— Ram Charan (@AlwaysRamCharan) May 5, 2025
‘పెద్ది ఫస్ట్ షాట్’ వీడియోను అద్భుతంగా రీ క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు థ్యాంక్స్. ఈ రోజు సన్ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సన్‌రైజర్స్ టీమ్ గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని రామ్ చరణ్, బుచ్చిబాబు సానా తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లకు అభిమానులు, నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతూ.. రెండు టీమ్స్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గెలవాలని కోరుకుంటున్నారు.
Also Read- Shrasti Verma : బిగ్ బ్రేకింగ్.. సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మపై కేసు నమోదు
కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కంటే సన్ రైజర్స్‌కు ఎంతో కీలకమైనది. తప్పని సరిగా ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్లకి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అలా కాలేదంటే, ఎలిమినేట్ లిస్ట్‌లోకి చేరుకున్నట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు