Nandamuri Balakrishna
ఎంటర్‌టైన్మెంట్

Balakrishna: ఇంతకీ బాలయ్య ఆ మాట అంది చిరంజీవినా? హరికృష్ణనా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ మరోసారి మాట తూలారు. అంతకు ముందు ‘సింహా’ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్.. ఇప్పటికీ కాంట్రవర్సీగానే చెప్పుకోబడుతుంటాయి. అలాగే అప్పట్లో ఓ మీటింగ్‌లో సైతం ఆయన ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ హిందూపురంలో జరిగిన సన్మాన సభలో నా అంతటి వాడు లేడు అనేలా మాట్లాడి, మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఆయన ఈ సన్మాన సభలో అన్నటువంటి మాటకు అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ కూడా జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే..

Also Read- Pawan Kalyan: స్నేహపూర్వకంగా పరిష్కరించాలి.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన

నందమూరి బాలకృష్ణ‌కు పద్మభూషణ్ (Padma Bhushan Balakrishna) పురస్కారం వరించిన సందర్భంగా హిందూపురం ప్రజలు ఆయనను ఆదివారం గ్రాండ్‌గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అక్కడి ప్రజలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా, హిందూపురం తనకు రెండో పుట్టినిల్లు అని, ఇది నందమూరిపురం అంటూ మాట్లాడారు. అలాగే తన తండ్రి చేయలేని పాత్రలను కూడా తను చేసినట్లుగా చెప్పుకొచ్చారు. నాకు నన్ను చూసుకునే గర్వం అంటూ.. మైక్‌ పట్టుకుని దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చిన బాలయ్య.. మధ్యలో రాజకీయాల్లోకి ఎందరో నటులు వచ్చారు. కానీ అడ్రస్ లేకుండా పోయారు. నేను హ్యాట్రిక్ కొట్టాను అంటూ మాట్లాడిన మాటలే.. ఇప్పుడు సోషల్ మీడియాలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీగా మారాయి.

‘‘హిందూపురం ప్రజలు నన్ను మూడోసారి గెలిపించారు. నటుడు అయినంత మాత్రాన వరుసగా ఎమ్మెల్యే అవ్వాలని ఏం రాసి లేదు. రాజకీయాల్లోకి ఎంతో మంది వచ్చారు. ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు. అడ్రస్ లేకుండా పోయారు. నేను ఇక్కడ హిందూపురంలో పనులు చేశాను కాబట్టి.. నన్ను గెలిపించారు. ఊరికే ఏదో సినిమా యాక్టరో, రామారావుగారి అబ్బాయో అయినంత మాత్రాన నన్ను గెలిపించలేదు. పనులు చేశాం. ప్రతి ఒక్కడికి ఎంతో కొంత సమాజంపై బాధ్యత ఉంది’’ అని బాలయ్య ఈ సభలో మాట్లాడారు. అయితే ఈ మాటలు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని ఉద్దేశించే అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే, ‘కాదురా పిచ్చోళ్లారా.. ఆ మాటలు నందమూరి హరికృష్ణ (Harikrishna)కు సంబంధించి అన్నవే, ఆయనే కదా అడ్రస్ లేకుండా పోయింది’ అంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఏది ఏమైనా, బాలయ్య మాట్లాడిన తీరు అయితే ఓ వర్గాన్ని హర్ట్ చేసేలానే ఉంది. ఆచితూచి మాట్లాడటం చేతకాని బాలయ్య.. ఇలా అప్పుడప్పుడు గర్వంతో మాట్లాడి దొరికేస్తుంటారు.

Also Read- JVAS: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్.. ఈ విషయం తెలుసా?

‘భారతరత్న’ ఇస్తేనే గౌరవం
‘‘నాకు ‘పద్మభూషణ్’ ఇచ్చినా, నాన్న నందమూరి తారక రామారావుకి ‘భారతరత్న’ ఇచ్చినప్పుడే మీ గౌరవం నిలబడుతుంది. అది తెలుగు జాతి కల. త్వరలోనే అది సాధ్యమవుతుందని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నట్లుగానే బాలయ్య మాట్లాడారు. దీనిపై కూడా బాలయ్యకు కౌంటర్లు పడుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంతో మంది ప్రధానులతో ఆయన సత్సంబంధాలను కొనసాగించారు. మరి అప్పుడెందుకు ‘భారతరత్న’ రాలేదు అంటూ బాలయ్యని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అయితే, సన్మాన సభ కాస్తా.. కాంట్రవర్సీ సభగా మారిపోయింది. నిత్యం ట్రోలింగ్‌లో ఉండే బాలయ్యపై మరోసారి విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు