Chiru and Sridevi in JVAS
ఎంటర్‌టైన్మెంట్

JVAS: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్.. ఈ విషయం తెలుసా?

JVAS: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని చిత్రంగా అతి పెద్ద సక్సెస్ సాధించిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన విషయం తెలిసిందే. 1990వ సంవత్సరం 9 మే, 1990లో విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని, మేకర్స్ మే 9న తేదీన ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో తీసుకు వస్తున్నారు. ఈసారి 2D అండ్ 3D ఫార్మాట్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఫార్మెట్స్ కోసం టీమ్ ఎంతగా కష్టపడిందో ఓ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు.

Also Read- Sritej: ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యపరిస్థితి ఇదే.. పిల్లాడి వీడియో వైరల్!

ఈ క్లాసిక్ చిత్రాన్ని సరికొత్తగా ముస్తాబు చేసి నేటితరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం టీమ్ ఎంతో కష్టపడిందని, దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల, ఎంతో వెతికినా కూడా అసలైన నెగిటివ్ దొరకలేదని తెలిపింది. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉండటంతో.. ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో టీమ్ అంతా అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమైనట్లుగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మేకర్స్ తెలుపుతూ..

‘‘2018లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగిటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి.. చిన్న, పెద్ద థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగాము. కొన్నిచోట్ల రీల్స్ పూర్తిగా డికంపోజ్ కాగా, చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికింది. అది కూడా దుమ్ము దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉంది. దానిని తీసుకుని వచ్చి పునరుద్ధరణ పనులు ప్రారంభించాం. రీల్ ఎక్కడెక్కడ కట్ అయిందో అక్కడ దానికి మరమ్మతులే చేసి, జాగ్రత్తగా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్‌ను తొలగించి, తర్వాత చిత్రాన్ని 8K రెజల్యూషన్‌లో డిజిటలైజ్ చేసి, 4K అవుట్‌పుట్‌గా మార్చారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, చిత్రాన్ని 3D రూపంలోకి మార్చే సాహసోపేతమైన నిర్ణయం టీమ్ తీసుకుంది’’ అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ అప్పారావుకు థ్యాంక్స్ చెబుతున్నారు.

Also Read- Heroine: పరేష్ రావలే కాదు.. ఈ హీరోయిన్ ‌కూడా సొంత యూరిన్ సేవించిందట!

అనేక ఏళ్ల శ్రమ, నిబద్ధతతో పునరుద్ధరించిన ఈ సినిమాను ఇప్పుడు సరికొత్తగా థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. గతంలో కంటే మెరుగైన అనుభూతితో 2D, 3D ఫార్మాట్లలో మే 9 నుంచి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ రీ రిలీజ్‌లో మెగా ఫ్యాన్స్ చేసే సందడి ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ. ఈ సోషియో-ఫాంటసీ డ్రామాకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీ దత్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శ్రీదేవి నటించిన ఈ సినిమాలో అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామ్లీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే