Shrasti Verma : సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. ఈమె పెట్టిన కేసులో ఎంత నిజముందో తెలీదు. కానీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, తాజాగా శ్రేష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. గుంటూరు జిల్లా SP కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI గుంటూరు జిల్లా నాయకులు కేసు పెట్టారు.
Also Read: Vishaka Double Murder Case: జంట హత్యల కేసులో సంచలన నిజాలు.. ఇంటర్నేషనల్ క్రిమినల్ అరెస్ట్
స్వాతంత్ర సమరయోధులు గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె తన సోషల్ మీడియాలో ” స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గార్ల ను ఈ బాస్టర్డ్స్ అన్నీ నాశనం చేశారని రాసింది . రాబోయే తరం ఈ బాస్టర్డ్స్ లాంటి వాళ్ళ గురించి కాకుండా నిజమైన స్వాతంత్య్ర సమరయోధుల గురించి నేర్చుకోవాలని అన్నది.
అలాగే, పుస్తకాల నుండి వారి గురించి తెలిపే వాటిని తీసివేయాలి, వారి జీవితాన్ని ప్రదర్శించే అధ్యాయాల మొత్తాన్ని తొలగించాలి ఎందుకంటే వారు దేశానికి ద్రోహం చేసి, మొత్తాన్ని నాశనం చేశారంటూ ఆమె రాసుకొచ్చింది. సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా SP గారి గ్రీవెన్స్ సమావేశంలో గుంటూరు జిల్లా NSUI అధ్యక్షులు షేక్.కరీం, సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై కేసు పెట్టారు. స్వాతంత్ర సమరయోధులను గౌరవించకుండా, హేళన చేస్తూ ఇలా ఎలా మాట్లాడుతుంది. హద్దులు దాటి ఇలా మాట్లాడిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే FIR నమోదు చేయాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Sunitha – Pravasthi: సింగర్ ప్రవస్తి, సునీత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన తమ్మారెడ్డి భరద్వాజ్
టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ వార్త పెద్ద దూమరమే రేపింది. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సమయంలో లేడీ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి, నెల రోజుల వరకు జైల్లోనే ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాలేంటో అందరికీ తెలుస్తాయని ఇప్పటికే మీడియాలో జానీ మాస్టర్ చెపుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.