Pawan Kalyan: ‘ఓజీ’ బ్లాక్ బాస్టర్ మీట్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రివ్యూయర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం అన్నారంటే.. ‘ప్రతి ఒక్కరూ సినిమా చూడటం మానేసి రివ్యూయర్లుగా మారుతున్నారు. సినిమాను సినిమాగా చూడాలి, కానీ అలా జరగడం లేదు. రివ్యూలు సినిమాని చంపేస్తుంది. ‘అత్తారింటికి దారేది’ సమయంలో పెట్టిన సంతకాలు మొన్నటి వరకూ కట్టుకుంటూ వచ్చేను. రివ్యూల ప్రభావం అంతలా ఉంటుంది. సినిమా మొదలవగానే స్టార్ట్ అవుతుంది రివ్యూ.. హీరో ఇప్పుడే వచ్చాడు. ఈ షాట్ బాలేదు. ఇది ఇలా ఉంటే బాగుంటుంది. సినిమాను మొత్తం చూడండి తర్వాత రాయండి. సినిమాను నమ్ముకుని కొన్ని వేల మంది ఉంటారు. నిర్మాతలు కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది.’ అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Innovative idea: భలే ఐడియా గురూ!.. రూ.16 లక్షల ఫ్లాట్ ఎవరూ కొనడం లేదని.. ‘మేధావి ప్లాన్’
ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.
Read also-Eagle Team: మరో సక్సెస్ సాధించిన ఈగల్ టీం.. 2 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్
పవన్ కళ్యాణ్ అభినయం, ఎమ్రాన్ హాష్మీ విలన్ రోల్‌తో విడుదలైన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG), టాలీవుడ్‌లో టెక్నికల్ ఎక్సలెన్స్‌కు మరో ఉదాహరణ. డైరెక్టర్ సుజీత్, తన స్క్రిప్ట్‌తో గ్యాంగ్‌స్టర్ లోకాన్ని రివైవ్ చేశాడు. ప్రొడ్యూసర్స్ డీ.వి.వి. దానయ్య, కల్యాణ్ దాసరి (సురేష్ ప్రొడక్షన్స్) బ్యాక్‌బోన్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ షేప్ తీసుకుంది. టెక్నికల్ టీం సూపర్! సినిమాటోగ్రఫీలో రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస డ్యూయల్ వర్క్ – ముంబై అండర్‌వరల్డ్‌ను విజువల్ స్పెక్టాకల్‌గా మార్చారు. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఎస్, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌కు బీట్స్ ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి, పేసింగ్‌ను టైట్‌గా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాశ్, 1990ల ముంబై లుక్‌ను రియలిస్టిక్‌గా సెట్ చేశాడు. మొదటి రోజే రూ.154 సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా రూ.300 కొట్ల గ్రాస్ సాధించి పవన్ కళ్యాణ్ సత్తా ఏమిటో టాలీవుడ్ కు తెలియజేస్తుంది.