pawan-kalyan-og-update(image :X)
ఎంటర్‌టైన్మెంట్

OG Update: పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీరా’ నుంచి మరో సాంగ్ వచ్చేది అప్పుడే!

OG  Update: ప్రపంచ వ్యాప్తంగా ఓజీ సినిమాకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సారి మరో అప్డేట్ తో  ముందకొచ్చారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆగస్టు 27 2025న ఉదయం 10: 08 గంటలకు సెకండ్ సాంగ్ విడుదల చేయనున్నారు నిర్మాతలు. అయితే ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నిర్మాతలు.  ఈ సినిమాలో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్లాక్‌బస్టర్ పాటలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మొదటి సగం గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉన్నాయని సమాచారం.

Read also-Charla mandal: భద్రాద్రి జిల్లాలో దారుణం.. గిరిజన యువతిపై ఆటో డ్రైవర్ల..

ఈ పాట విడుదల తేదీని ప్రకటించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మామోలుగానే ధమన్ సంగీతానికి థియేటర్లలో బాక్సులు బద్దలవుతాయి. అయితే ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంగీతం అందించానని థమన్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ పాట మరో బుట్టబొమ్మ అవుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనిలో ఉంది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read also-CI Rajesh: పేరుకే రక్షక భటుడు.. లోపల మాత్రం అక్రమార్కుడు.. ఎవరంటే?

పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ట్రైలర్ లో సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నారు. అయితే మరిన్ని వివరాల కోసం వేచిఉండాల్సిందే. అప్పటి వరకు, ఓజీ ట్రైలర్ గురించి అధికారిక సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగినప్పటికీ, షూటింగ్ పూర్తి చేశారు. ‘హరి హర వీరమల్లు’ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి అభిమానులు బారీ అంచనాలు పెట్టుకున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం