OG OTT Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’ ఓటీటీ డేట్ ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక గ్రాసర్ గా ‘ఓజీ’ సినిమా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బ్లాక్ బాస్టర్ సినిమా ఓటీటీకి సంబంధించి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పవర్ స్టార్ బ్లడ్ బాత్ మూవీ ‘ఓజీ’ అక్టోబర్ 23, 2025న ఓటీటీలో రానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని చూసిన పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రావడంతో థియోటర్లకు వచ్చి చూడలేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Telugu movies: థియేటర్లలో వందల రోజులు ఆడే సినిమాలు ఇప్పుడెందుకు ఆడటంలేదు.. రిజన్ ఇదే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల అందరి కలలు నెరవేర్చిన సినిమా ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG). ఈ సినిమా విడుదలైన రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంటూ ప్రభంజనం సృష్టిస్తోంది. సుజీత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్, పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇమ్రాన్ హాష్మీ, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది. మొదటి రోజు ఈ సినిమా దాదాపు రూ.157 కోట్లకు పైగా వసూల్లు సాధించి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఓవరాల్ గ్రాస్ రూ.300 కోట్లకుపైగా దాటింది. ఇప్పుడు ఓటీటీలో ఈ ఫైర్ స్ట్రోమ్ తన సత్తా చాటడనికి రెడీ అవుతుంది.
Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుపుతున్న బడా నిర్మాత!.. దర్శకుడు ఎవరంటే?
ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.
Padella kritham bombay lo ochina thoofanu.. malli thirigi osthunnadu! 🌪️ pic.twitter.com/V61twCD3vu
— Netflix India South (@Netflix_INSouth) October 18, 2025
