Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఫైర్ స్ట్రోమ్ ప్రపంచ రికార్డుల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిన యూ ట్యూబ్ వీడియోస్ లో రెండో ప్లేస్ లో ట్రెండ్ అయింది. దీనికి సంబంధించిన ఓ ఇమేజ్‌ను సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫైర్ స్ట్రోమ్ యూ ట్యూబ్ లో ఏ స్థాయిలో సునామీ సృష్టిస్తోందో తెలిసిందే. తాజాగా ఈ విషయం కూడా తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also- Saina Nehwal: విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా.. సైనా నెహ్వాల్ సంచలన పోస్టు!
బ్లెడ్ ఈస్ ఇన్ ద ఫయర్ దేర్ విల్ కమ్ ఎ లీడర్ ఓజెస్ గంభీర అంటూ మెదలౌతుంది సాంగ్. అందులో థమన్ మ్యూజిక్ చూస్తుంటే వేరే లెవల్ లో ఉంది. మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని వింటే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఫెష్ ట్యూన్స్ తో కొత్తగా అనిపించేలా ఉంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ చూస్తుంటే ఫాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉంది. వీఎఫ్ఎక్స్ అయితే ఫైర్ స్ట్రోమ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఈ పాటలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, జపనీస్ భాషలు కలిసి ఉన్నాయి. టోటల్ గా పవన్ కళ్యాణ్ ఫైర్ స్ట్రోమ్ మ్యూజిక్ రికార్డులను తగలెట్టేసేలా కనిపిస్తుంది. సినిమా మొత్తం ఇలాగే ఉంటే టాలీవుడ్ రికార్డులకు ముప్పు పొంచి ఉందంటున్నారు సినిమా క్రిటిక్స్.
Read also- Anganwadi Teachers: ఫ్రీ ప్రైమరి టీచర్స్‌గా అంగన్వాడీ టీచర్లను నియమించాలి.. మంత్రికి వినతి
‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో తనదైన శైలితో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నారు. స్టైలిష్ విజువల్స్, థమన్ పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ చిత్రం అభిమానుల అంచనాలను మించనుంది. ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమాలో తొలిసారి విలన్‌గా కనిపించడం హిందీ, తెలుగు ప్రేక్షకులను ఆకర్షించనుంది. సుజిత్ స్టైలిష్ టేకింగ్‌తో ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.