pawan-kalyan(image :x)
ఎంటర్‌టైన్మెంట్

OG sensation: ‘ఓజీ’ చూసిన అభిమాని ఏం చేశాడో తెలుసా.. వీడియో వైరల్..

OG sensation: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. దీనిని చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సినిమా ఇంత బాగా రావడంతో అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు భక్తులుగా మారుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానులు దర్శించుకునే పుణ్యం క్షేత్రంలా థియేటర్లు తయారయ్యాయి. ఎక్కడ చూసినా పూజలు, పునస్కారాలతో థియేటర్లు దర్శనీయ ప్రదేశాలుగా మారాయి. అభిమానులు పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే కనిపించడంతో ఇది చాలు ఈ రికార్డులు బద్దలు గొట్టడానికి ఏ హీరోకి అయినా మరో నలభై సంవత్సరాలు పడుతుందంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read also-Bigg Boss Telugu 9: ఇది చదరంగం కాదు.. రణరంగం! బిగ్ బాస్ హౌస్‌లోకి న్యూ సెలబ్రిటీస్!

అయితే దీనికి భిన్నంగా ఒక వీరాభిమాని నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో సీన్ రీ క్రియోట్ చేశాడు. సినిమా చూసినంత సేపూ తన ఎమోషన్ ను దాచి పెట్టుకున్నాడు. థియేటర్ నుంచి అదే ఎమోషన్ తో బయటకు వచ్చి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి సేమ్ నానీ లాగా చేస్తాడు. ట్రైన్ వెళ్లే సమయంలో ఆ అభిమాని అరుపులు పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను తెలియజేస్తాయి. అంటే ఇలాంటి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది. ఆ వీరాభిమాని చేసిన పనికి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ పై అభిమానం అంటే ఇలాగే ఉంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదే కాకుండా దాదాపు రెండు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితీ ఇలాగే ఉంది. థియేటర్ నుంచి బయటకు వస్తూ ఎమోషన్ కు గురవుతున్నారు.

Read also-Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.

Just In

01

Sujeeth: ‘ఓజీ 2’లో ప్రభాస్.. సుజీత్ ఏమన్నారంటే..

Hyderabad Metro: ఇకపై సర్కారు మెట్రో రైలు.. చర్చలు సఫలం

US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?

Jagapathi Babu: రూ. 800 కోట్ల మోసం.. ఈడీ విచారణకు జగపతి బాబు

KTR: స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు