Bigg Boss Telugu 9: బిగ్ బాస్ డే 18కి (Bigg Boss Telugu Season 9) సంబంధించి తాజాగా మేకర్స్ ప్రోమో వదిలారు. ఈ ప్రోమో చూస్తుంటే ఇందులోకి సరికొత్తగా కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. అయితే ఆ కంటెస్టెంట్స్‌ని ఎన్నుకునే ప్రక్రియ, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వారికి ఇవ్వడం చూస్తుంటే.. నిజంగానే బిగ్ బాస్.. రణరంగం ఆడబోతున్నాడనేది అర్థమవుతుంది. రాబోయే కంటెస్టెంట్‌కు ఎవరెవరు ఓటు వేశారో, వారిని రివీల్ చేసి.. మిగతా వారిని శత్రువులుగా చూపించే ప్రక్రియ నడుస్తున్నట్లుగా ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. అప్పుడు హౌస్‌లోకి వాళ్లు వద్దు, వీళ్లు వద్దు అంటూ కంటెస్టెంట్స్ మాట్లాడుకునే వీడియోని కూడా బిగ్ బాస్ రివీల్ చేశారు. కాబట్టి రాబోయే వారితో నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లో రణరంగమే జరుగుతుందని భావించవచ్చు. ఇదే మాట బిగ్ బాస్ నోట వెంట కూడా రావడం విశేషం.
కొత్త కంటెస్టెంట్స్‌పై చర్చలు మొదలు
ఇక ప్రోమోని గమనిస్తే.. భరణి (Bharani), ప్రియా (Priya) మాట్లాడుకుంటూ.. మెంటల్లీ అబ్బాయిలు ఇద్దరి కన్నా, అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. అనంతరం గ్రూపు డిస్కషన్‌లో కెప్టెన్ డిమోన్ పవన్.. మరో ఇద్దరి పేర్లు చెబుతున్నాడు. దివ్యానా? అంటూ ఇమ్ము తలపట్టుకున్నాడు. నాగ లేదంటే షాకిబ్.. వీరిద్దరిలో ఒకరు. దివ్య మాట్లాడేటప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్‌గా.. నాకే అన్నీ తెలుసు మీకంటే ఎక్కువ అనే ఫీలింగ్ కలిగిందని రీతూ చెబుతోంది. తర్వాత భరణి, డిమోన్ పవన్ మధ్య డిస్కషన్ నడిచింది. అందరూ హాల్‌లో కూర్చుని ఉంటే.. బిగ్ బాస్ వారికి ఓ సందేశం ఇచ్చాడు. అదే.. ఈ షో పై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.
Also Read- Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!
చదరంగం కాదు.. ఇది రణరంగం
హౌస్‌లో ఉన్న సభ్యులందరిని ఉద్దేశించి బిగ్ బాస్ (Bigg Boss) మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు కొత్త ఇంటి సభ్యులుగా ఇంట్లోకి ఏ ఒక్కరు అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి, మీరు ఓటు వేయాల్సిన సమయం వచ్చింది’’ అని చెప్పగానే.. ఒక్కొక్కరు వెళ్లి ఓటు వినియోగించుకుని వచ్చారు. ‘ఇంట్లోకి వచ్చేది ఎవరో.. మీ ఓట్స్‌తో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేశారు. చదరంగంలో మీరు మీ పావులు కదిపారు. కానీ ఇది చదరంగం కాదు.. రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం’ అని చెప్పగానే కొత్తగా కంటెస్టెంట్ లోపలికి వస్తున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఆల్రెడీ నలుగురు కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌కి చూపించడమే కాకుండా, వారితో డిస్కషన్ కూడా జరిగినట్లుగా ఇంతకు ముందు వచ్చిన ప్రోమో తెలపగా, ఇప్పుడు వచ్చిన ప్రోమోతో, అసలు సిసలు ఆట ఇకపై మొదలు కాబోతుందని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు