OG collections: తెలుగు సినిమా చరిత్రలో బారీ అంచనాలతో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా కలెక్షన్లులో తనదైన రేంజ్ లో దూసుకుపోతుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.154 కొట్లు గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ సత్తా ఏమిటే మరోసారి టాలీవుడ్ కి తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ కలెక్షన్స్ టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిని నెలకొల్పాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. సుజీత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇమ్రాన్ హాష్మీ, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది.
Read also-Fan Emotional Video: దేవుడి కోసం సాధించండి.. స్టేడియంలో పాక్ ఫ్యాన్ ఎమోషనల్.. భారత్‌పై ఇంత కసి ఉందా?
రికార్డులు
పవన్ కల్యాణ్ మునుపటి సినిమాలతో పోల్చితే, ‘ఓజీ’ మొదటి రోజు కలెక్షన్స్‌లో ‘వకీల్ సాబ్’ (రూ.34 కోట్లు) ‘భీమ్‌లా నాయక్’ (రూ.35 కోట్లు) వంటి చిత్రాలను దాటి, అతని కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ‘దేవర’ సినిమా ఓపెనింగ్‌ను (రూ.75 కోట్లు) కూడా మించిపోయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ప్రీమియర్ షోలకు టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌ను మరో స్థాయి ‘గ్లోబల్ స్టార్’గా నిలబెట్టిందని అభిమానులు ఆనందిస్తున్నారు. మొదటి రోజు ఇంత భారీ కలెక్షన్స్ సాధించిన ‘ఓజీ’, వీకెండ్‌లో మరో రూ.200 కోట్లు సాధించి రూ.300 కోట్లు మైలురాయి అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అంచనా. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విజయాన్ని పండగలా జరుపుకుంటున్నారు.
ఓవరాల్ గా ఈ సినిమా రూ.600 కోట్లు క్లబ్ లో చేరుతుందని అభిమానులు ఆసిస్తున్నారు.
ఇప్పటీవరకూ ‘ఓజీ’ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ (రూ.116 కోట్లు), షారుఖ ఖాన్ జవాన్ (రూ.128 కోట్లు), లియో (రూ.143 కోట్లు), కూలీ (రూ.153 కోట్లు) వంటి పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాల ఓపినింగ్ డే ఒన్ కలెక్షన్లను దాటిపోయింది. ఇది పవన్ కల్యాణ్ రణ్‌బీర్ కపూర్, షారుఖ్ ఖాన్, విజయ్, రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్లను వెనక్కి నెట్టి భారీ ఓపెనింగ్ సాధించింది. ఈ సినిమా కంటే ముందు సాలార్ (రూ.158 కోట్లు) KGF చాప్టర్ 2 (రూ.159 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. టాప్ స్పాట్ పుష్ప 2: ది రైజ్ మొదటి రోజు రూ.274 కోట్లు సంపాదించింది. తర్వాత రెండు SS రాజమౌళి సినిమాలు – RRR (రూ.223 కోట్లు) బాహుబలి 2 ఉన్నాయి.
Idhi Pawan Kalyan Cinema…..#OG Erases History 🔥
Worldwide Day 1 Gross – 154 Cr+ 💥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/Olf8owSSSZ
— DVV Entertainment (@DVVMovies) September 26, 2025