HBD OG - LOVE OMI - Glimpse( image :X)
ఎంటర్‌టైన్మెంట్

OG USA Box Office: యూఎస్‌‌‌‌లో ‘ఓజీ’ తుఫాన్.. ప్రీ సేల్స్‌‌లో ఆ మార్క్ దాటిన సినిమాగా రికార్డ్

OG USA Box Office: ఉత్తర అమెరికాలో పవన్ కళ్యాణ్ రికార్డులను రికార్డుల తుఫాన్ సృష్టిస్తున్నాడు. ‘ఓజీ’ సినిమా విడుదలకు మూడు వారాలకు ముందే అక్కడ ఇప్పటి వరకూ ఉన్న రికార్డులు తిరగరాస్తుంది. ఇంకా ట్రైలర్ విడుదల కాక ముందే అక్కడ సంచలనాలు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ స్టామినా ఏంటో తెలియజేస్తుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఓజీ’ తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు.

Read also-Kim Jong Un: పుతిన్‌తో కిమ్ భేటీ ముగిసిన వెంటనే సీటును శుభ్రం చేసిన భద్రతా సిబ్బంది.. కారణం ఇదే!

ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మూడు వారాల ముందే.. ఓజీగా ఆయన బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ‘ఓజీ’ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఓజీ’ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, మైలురాయి చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read also-Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం ప్రాజెక్ట్.. 2 గేట్లకు లీకేజీలు.. భద్రతపై తీవ్ర ఆందోళనలు

పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి అద్భుతమైన తారాగణం ఉన్నారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ తెలుగు రాష్ట్రాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విడుదలైన సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేలా చేశాయి. రిలీజుకు ముందే రికార్డుల నమోదు చేస్తున్న సినిమా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!