Pawan Kalyan: ‘ఓజీ’ సినిమా కూడా మనదే.. ఇప్పుడు ‘ఓజీ’ కాదు..
Pawan Kalyan at HHVM Event
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: ‘ఓజీ’ సినిమా కూడా మనదే.. ఇప్పుడు ‘ఓజీ’ కాదు.. ‘వీర’ మాత్రమే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఎక్కడికి వెళ్లినా అభిమానులు ‘ఓజీ’, ‘ఓజీ’ (OG) అని అరుస్తుంటారనే విషయం తెలియంది కాదు. సోమవారం జరిగిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ వేడుకలో కూడా అభిమానులు ‘ఓజీ’, ‘ఓజీ’ అని అరుస్తుంటే.. పవన్ కళ్యాణ్ అసహనానికి గురయ్యారు. వెంటనే అభిమానులకు అలా అనవద్దంటూ సూచించారు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ ఓ ముఖ్య పాత్రను పోషించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Also Read- Krish Jagarlamudi: దర్శకుడు క్రిష్ జాగర్లమూడి HHVM నుంచి తప్పుకుంది అందుకేనా?

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ వేడుకను లక్షలాది అభిమానుల మధ్య గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నాంక. కానీ వర్షాలు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువమందితోనే నిర్వహిస్తున్నాము. అభిమానుల క్షేమం గురించి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీజీపీ జితేందర్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాల్లోకి వచ్చి మీ (ఫ్యాన్స్) అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఈశ్వర్ ఖండ్రే (కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్) వంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన కందుల దుర్గేష్, రఘురామకృష్ణ రాజులకు కూడా నా ధన్యవాదాలు.

రెండు సంవత్సరాల క్రితం ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు.. అన్ని సినిమాలకు వందల్లో టికెట్ల ధరలు ఉంటే, ఆ సినిమాకి 10, 20 రూపాయలు టికెట్ రేట్లు చేశారు. నేను అప్పుడు ఒక మాట చెప్పను ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు గురించి కాదు, రికార్డుల గురించి కాదు. మనం ధైర్యంగా నిలబడితే న్యాయం కచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నాకసలు నటుడు అవ్వాలని కోరిక కూడా లేదు. సగటు మనిషిగా బ్రతకాలనే ఆలోచన మాత్రమే ఉండేది. నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే. కిందపడి లేచినా, ఎలా ఉన్నా.. అన్నా నీ వెంట మేమున్నాం అని అభిమానులు ఎప్పుడూ అండగా అన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు 29 ఏళ్ళు అవుతుంది. కొంచెం వయసు పెరిగి ఉండొచ్చేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బ్రతికే ఉంది. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. అప్పుడొక తప్పు చేశాను. జానీ సినిమా తీయడమే నేను చేసిన తప్పుదు. ఆ సినిమా పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు నా వెంటే ఉన్నారని నమ్మాను’’. అని చెప్పుకొచ్చారు. ఈ మాట అనగానే అభిమానులు ‘ఓజీ’ మోత మోగించారు.

Also Read- Director Krish: ఆ శక్తిని ఏ కెమెరా కూడా బంధించలేదు.. పవన్ మండే నిప్పు కణం.. క్రిష్ జాగర్లమూడి

ఆ సౌండ్‌కి కాస్త ఇబ్బందిగా పీలైన పవన్ కళ్యాణ్.. వెంటనే ‘ఇది ఓజీ కాదు.. అది కూడా మన సినిమానే. కానీ ఇప్పుడు ఓన్లీ వీర మాత్రమే’ అని అనగానే అతా ‘వీర’ అంటూ హోరెత్తించారు. అంతే ఆ దెబ్బతో సోషల్ మీడియాలో ‘వీర’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మొత్తానికి రైట్ టైమ్‌లో రైట్ వే చూపించారని వీరమల్లు టీమ్ అంతా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం