Krish Jagarlamudi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒక భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా, దీనికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రం 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుంది, ఇందులో పవన్ కళ్యాణ్ ఒక ధీరోదాత్తమైన బందిపోటు పాత్రలో కనిపిస్తారు. నిధి అగర్వాల్ కథానాయికగా, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ముందు దర్శకుడిగా చేసిన క్రిష్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ గురించి, నిర్మాత గురించి చెప్పుకొచ్చారు.
Read also- Private schools in Gadwal: ప్రైవేట్ బడుల్లో జోరుగా దందా.. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
అయిదే దర్శకుడు క్రిష్ ఎందుకు? ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అనే దానిపై ఇండస్ట్రీలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత ఏఎం రత్నం ఈ విషయంపై స్పందించారు. హరి హర వీరమల్లు సినిమా మొదలు పెట్టి చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో ఆర్థిక కారణాలతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని అన్నారు. వేగంగా సినిమాలు తీసే దర్శకుడికి ఒక సినిమాపై దాదాపు 5 సంవత్సరాలు ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని నిర్మాత అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ ఈ విషయంపై స్పందించారు. క్రిష్ వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో ఈ సినిమా నుంచి వెళ్లవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. కాగా దర్శకుడి వ్యక్తిగత కారణాలే ఉండి ఉంటాయని టాక్ నడుస్తోంది. క్రిష్ పవన్ మూవీ నుంచి తప్పుకున్న ఏడాదే పెళ్లి చేసుకోవడం, డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉండటం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే డ్రగ్స్ కేసులో ఉపశమనం కలిగినా పిలిచినపుడు విచారణకు రావాలని పోలీసులు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
Read also- BRS KTR: నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆదేశాలు
‘హరి హర వీరమల్లు’ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడిని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. తాజాగా క్రిష్ కూడా ఈ సినిమాపై స్పందించారు. ఈ సినిమా ఇద్దరు లెజెండ్స్ వల్లే పూర్తయిందని వారిలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు నిర్మాత ఏఎం రత్నం అంటూ చెప్పుకొచ్చారు. కాగా దర్శకుడు జ్యోతి కృష్ణ గురించి మాట్లాడక పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘాటీ’ ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో రూపొందుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.