Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో.. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. మంగళవారం మంగళగిరిలో మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్ర విశేషాల గురించి చెబుతూ..
‘‘జనసేన పార్టీని నడిపే క్రమంలో ఈ సినిమాలను ఒప్పుకోవడం జరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ‘హరి హర వీరమల్లు’ సినిమా చిత్రీకరణ చేశాం.
కోహినూర్ డైమండ్ విజయవాడ కృష్ణాతీరం కొల్లూరు దగ్గర దొరికింది. ఆ వజ్రం కులీకుతుబ్ షా నుంచి మొగలుల వరకు వెళ్లి, ఒక నియంత, సొంత సోదరుడిని చంపేసిన, తండ్రిని జైలులో పెట్టించిన, దేవాలయాలు కూల్చేసిన, హిందువుగా బతకాలంటే శిస్తు కట్టాలని హుకుం జారీ చేసిన ఔరంగజేబు కూర్చొనే ఆసనంపై ఉంటుంది. ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని హీరో పాత్రకు అసైన్ చేయబడుతుంది. అది నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపించి ఈ సినిమా చేయడం జరిగింది.
Also Read- Pawan Kalyan: నాగబాబు మంత్రి పదవిపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్
దాదాపు 5 సంవత్సరాలు ఈ సినిమా చిత్రీకరణకు టైమ్ పట్టింది. 2 కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టాయి. సినిమా చివరి దశకు వచ్చిన సమయంలో గత ప్రభుత్వం.. చంద్రబాబును అరెస్ట్ చేయడం, నన్ను వైజాగ్‌లో నిర్భంధించడం వంటి వాటితో నేను రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమాకు కష్టాలు వచ్చేశాయి. ఫైనల్‌గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దామంటే అడ్మినిస్ట్రేషన్ తెలుసుకునే నిమిత్తం కొన్ని నెలలు వాయిదా పడింది. ఫైనల్‌గా నా ఆఫీస్‌కు కొద్దిపాటి దూరంలో సెట్స్ వేసి.. టైమ్ కుదిరినప్పుడల్లా బ్యాలెన్స్ షూట్ చేశాం. ఉదయం 7 నుంచి 9 వరకు టైమ్‌లోనే షూట్ చేశాం.
చారిత్రాత్మక నేపథ్యంతో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉంటుంది. జిజియా పన్ను వంటి ఆసక్తికర సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. దీనిలో ఎటువంటి రాజకీయ నేపథ్యం ఉండదు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నేను చేశాను కాబట్టి.. దీనికి రాజకీయాలు అపాదిస్తున్నారేమో నాకయితే తెలియదు. ఇందులో ధర్మం అనేది ఒక అంశం అంతే.
సినిమానా, రాజకీయాలా? అంటే నా ప్రయారిటీ మాత్రం రాజకీయాలే అని చెబుతాను. అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి సినిమాలు అయితే చేయను. నాకు ఖాళీ ఉన్న సమయంలోనే ఈ సినిమా పూర్తి చేశాను.
Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ సినిమా కూడా మనదే.. ఇప్పుడు ‘ఓజీ’ కాదు.. ‘వీర’ మాత్రమే!
నేను మాములుగా ప్రమోషన్స్ చేయను. కానీ ఈ సినిమాకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. అది కూడా నా వల్ల అని చెప్పను. ఒకటి న్యాచురల్ డిజాస్టర్, రెండు మ్యాన్ మేడ్ డిజాస్టర్. దీనికి నిర్మాత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను నైతిక బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనికి రెమ్యునరేషన్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, ముందు నిర్మాత నిలబడాలి. సినిమా ఆడాలి అనే సదుద్దేశంతోనే ప్రమోషన్స్ చేస్తున్నాను.
నేను పాలిటిక్స్‌లో ఉన్నందుకు గత ప్రభుత్వంలో నిర్మాతలు కూడా నలిగిపోయారు. వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి నాపై ఉంది. మాములుగా పరిస్థితులు ఉంటే, నాకు ఈ అవసరం ఉండేది కాదు.
నా సినిమాలకు రూ. 10, రూ. 15 టికెట్ల ధరలు పెట్టి ఇబ్బంది పెట్టినా, వాటన్నింటిని దాటుకుని ఇక్కడి వరకు రావడం పెద్ద విజయం అనిపించింది. ఆ టైమ్‌లో కూడా నాకోసం నిర్మాతలు నిలబడ్డారు. ప్రతి చిన్న పనికి ఒక యుద్ధం చేయాల్సి ఉంటుందని చెబుతూ ఉంటాను. సంఘర్షణ అనేది నా జీవితంలో పార్ట్ అయిపోయింది.
ఇది ఫిక్షనల్ స్టోరీ. దీనిపై కాంట్రవర్సీ చేస్తూ వారెవరో వ్యక్తిని తీసుకువచ్చారు కానీ, అసలు దీనికి సంబంధం లేదు. వీరమల్లు క్రియేటెడ్ క్యారెక్టర్..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు