OG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘బ్రో’. ఆ సినిమా సమయంలోనే ఆయన నాలుగు సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu). రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రం.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. పలు మార్లు విడుదల విషయంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా మేకర్స్ మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ లేకుండానే ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతిలో ఈ వేడుకను నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
Also Read- Kamal Haasan: నేను అసూయ పడే నటుల్లో తనొకడు.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
ఇక ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మరో సినిమా ‘ఓజీ’ (OG Movie). ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. బ్యాలెన్స్ షూటింగ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసేలా సుజీత్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఓజీ’ సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. సెప్టెంబర్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత ఇష్టమో తెలియంది కాదు.
Also Read- Allu Aravind: పవన్ కళ్యాణ్ చెప్పింది 100 శాతం నిజం? ఆ నలుగురిలో నేను లేను!
సెప్టెంబర్‌లోనే పవన్ కళ్యాణ్ బర్త్‌డే. ఇప్పుడు ‘ఓజీ’ని 25 సెప్టెంబర్ 2025న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండ్‌ని బద్దలు కొడుతోంది. నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అయితే సోషల్ మీడియాలో అస్సలు ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ ఫొటోని సుజీత్ పట్టుకుని ఉన్న ఫొటోని వదిలి, ఫ్యాన్స్‌లో మరింత హుషారును నింపింది. దీంతో అస్సలు ఫ్యాన్స్ ఆగడం లేదు. సెప్టెంబర్‌లో రెండు పండుగలు అంటూ కామెంట్స్‌తో మోత మోగిస్తున్నారు. అలాగే దసరా టైమ్ కూడా కావడంతో.. ‘ఓజీ’ రికార్డుల మోతని తట్టుకోవడం ఎవరితరం కాదంటూ అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి స్టార్ చేశారు. మొత్తంగా అయితే, ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలైతే విడుదల కావడం పక్కా అనేలా.. ‘ఓజీ’ కూడా ఊపుని తెచ్చేసింది. మూడో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్‌లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారనేలా రీసెంట్‌గా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన మరో సినిమా ఉంటుందో, ఉండదో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
25. SEPT. 25
Raaskondraa……🔥🔥🔥#OG #TheyCallHimOG pic.twitter.com/wv8eCwDJ5v
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు