Pawan Kalyan: ఒక వైపు షూటింగ్.. మరో వైపు డబ్బింగ్.. రెండూ పూర్తి
Pawan Kalyan Shootings
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: ఒక వైపు షూటింగ్.. మరో వైపు డబ్బింగ్.. మెంటలెక్కిస్తోన్న పవర్ స్టార్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో కొన్ని రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాజకీయాల పరంగా తన షెడ్యూల్స్‌కు అడ్డంకి లేకుండా.. ఎన్నికలకు ముందు ఆయన ఓకే చేసిన సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు సినిమాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాలు ఏవంటే.. ఒకటి ‘ఓజీ’, రెండోది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్ ఆదివారం మేకర్స్ వదలడంతో.. సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఈ రెండు సినిమాల అప్డేట్స్ ఏమిటంటే..

Also Read- Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!

పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించినట్లుగా చెబుతూ.. ఈ షెడ్యూల్‌తో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో టీమ్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్‌తో ఫొటో దిగారు. అందరూ పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్యూ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సినిమా పట్ల విశేషమైన అంకితభావం, మక్కువను ప్రదర్శించిన తీరుకు, చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత, తెరపై – తెర వెలుపల కూడా ఆయన అసాధారణ వ్యక్తిగా మన్ననలు ఎందుకు అందుకుంటున్నారో మరోసారి నిరూపించిందని తెలుపుతూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ.. నిర్మాతలు తమ ఆనందాన్ని తెలియజేశారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా.. చిత్ర బృందం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలు పెట్టనుందని, అందుకు సంబంధించి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read- Ram Gopal Varma: ‘మిరాయ్’పై మరో ట్వీట్.. వర్మకి టాపిక్ దొరికిందోచ్!

ఓజీ డబ్బింగ్ పూర్తి

మరో వైపు ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయిన ‘ఓజీ’ సినిమాకు (OG Movie) సంబంధించి వచ్చిన అప్డేట్‌తో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర డబ్బింగ్ పనులను పవన్ కళ్యాణ్ పూర్తి చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ఆదివారం ప్రకటించారు. ఆయన డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇప్పటి వరకు సెప్టెంబర్ 25న ఈ సినిమా వస్తుందా? అని కొందరు డౌట్స్‌లో ఉన్నారు. ఆ డౌట్స్‌కు పవన్ కళ్యాణ్ తెరదించారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌‌పై పూర్తి స్థాయిలో మేకర్స్ దృష్టి పెట్టనున్నారు. ఇలా ఒకేసారి రెండు బాధ్యతలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ నిబద్ధతని చూసి.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోతోంది. అసలు ఎలా సామి? ఇలా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ అప్డేట్స్‌తో పవన్ కళ్యాణ్ పేరు మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Manoj Manchu: మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు.. మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!

Kodanda Reddy: వ్యవసాయ రంగంలో ఇంకా సంస్కరణలు రావాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి!

Redmi Note 15 5G: లాంచ్‌కు ముందే లీకైన Redmi Note 15 5G.. ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?

Sudharshan Reddy: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచండి: సుదర్శన్ రెడ్డి

Sangareddy District: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో చెలగాటం.. విద్యాశాఖ అధికారులపై ఏఐఎస్ఎఫ్ ఫైర్!