Pawan Kalyan: ఓజీ షూట్ నుంచి తిరంగ యాత్రకు.. టాట్టూ చూశారా!
Pawan Kalyan at Vijayawada Tiranga Yatra
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: ‘ఓజీ’ షూట్ నుంచి సరాసరి ‘తిరంగా యాత్ర’.. పవన్ చేతిపై టాటూ గమనించారా?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్.. ఆ వెంటనే ‘ఓజీ’ సెట్స్‌లో అడుగు పెట్టారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్స్‌లో ఉండటంతో, కొంతమంది కావాలని పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలన వదిలేసి, షూటింగ్స్ చేసుకుంటున్నాడు అంటూ వైసీపీకి చెందిన కొందరు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, షూటింగ్స్ చేసుకుంటున్నా, పాలన వదిలేయలేదనే దానికి ఉదాహరణగా, విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. అలా రాతలు రాసే వారందరికీ ఏపీ డిప్యూటీ సీఎం ఇచ్చి పడేశారు.

Also Read- Sree Vishnu: ‘సింగిల్’ శ్రీ విష్ణుకు బంపరాఫర్.. చెక్ కూడా ఇచ్చేశారట!

ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నా, ఎప్పటికప్పుడు పాలనకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘ఓజీ’ షూట్ నుంచి సరాసరి విజయవాడలో భారతీయ జనతా పార్టీ (BJP), తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన పార్టీ (JSP) ఆధ్వర్యంలో భారత త్రివిధ దళాలకు మద్దతుగా నిర్వహించిన తిరంగా యాత్ర‌లో పాల్గొన్నారు. అందుకు సాక్ష్యం ఆయన చేతికి ఉన్న టాటూనే. అవును, అప్పుడు ‘ఓజీ’ టీజర్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి ప్రత్యేకంగా ఒక టాటూ ఉన్నట్లుగా అంతా గమనించారు. ఇప్పుడదే టాటూ పవన్ కళ్యాణ్ చేతికి కనిపించింది. అంటే, ఆయన ప్రస్తుతం ‘ఓజీ’ షూట్‌లో పాల్గొంటున్నారనే విషయంలో మరింత క్లారిటీ రావడంతో పాటు, పాలన పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేసే వారికి కూడా, ఈ యాత్రతో సమాధానం చెప్పినట్లయింది.

పవన్ కళ్యాణ్‌కు సినిమాలు చేయాలని ప్రజంట్ కోరికేం లేదు. ఆ విషయం ఆయన ఇప్పటికే పలు మార్లు చెప్పి ఉన్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్స్‌లో పాల్గొంటున్న సినిమాలు ఎన్నికల ముందే అంగీకరించినవని అందరికీ, ఆ కామెంట్స్ చేసే వాళ్లకి కూడా తెలుసు. తన వల్ల ఎవరూ సఫర్ అవ్వకూడదని భావించే పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నా కూడా, ఎంతో నిబద్ధతతో అంగీకరించిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. అంగీకరించిన సినిమాలకు ఇలా మధ్య మధ్యలో షూటింగ్ చేసి, వాటిని పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

Also Read- Kannappa: ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్.. ‘శివయ్యా’ అని విష్ణు ఎందుకు పిలిచాడంటే?

ఇక తిరంగా యాత్ర విషయానికి వస్తే.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగిన ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ శిక్షణ, ఆయుధాలు, ఆశ్రయం కల్పిస్తోందని అన్నారు. మన దేశపు అభివృద్ధిని చూసి ఓర్వలేక, తమ దేశాన్ని పాలించే శక్తి లేక.. మనల్ని వెనక్కి నెట్టాలని ఇలా దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, సుమారు 5 వేల మందికి పైగా ఈ యాత్రలో పాల్గొని, జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో భారత్ సైనికులకు జేజేలు పలికారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం