Paradha: టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో నటించేవారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటిది యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల సమంతతో ‘శుభం’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read also- Chandrababu: సీమకు నీరిచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మరిచిపోలేను!
ఈ సినిమా పూర్తయి నెలలు కావొస్తున్నా.. విడుదల మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. కాగా నేడు సినిమా విడుదల తేదీ ఉన్న పోస్టర్ తో పాటు సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ‘పరదా’ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌లో అనుపమ పరమేశ్వరన్ సాంప్రదాయ చీరలో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో దేవత విగ్రహం ఉండటం ఆధ్యాత్మిక, ఎమోషనల్ కోర్ ని యాడ్ చేసింది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన ‘యత్ర నార్యస్తు’ పాట మహిళల శక్తిని, పవిత్రతను స్ఫూర్తిదాయకంగా చూపిస్తూ.. దైవత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. వినిపించే ప్రతి లైన్ వెనక ఓ బలమైన భావం వుంది. వనమాలి రాసిన అర్థవంతమైన పదాలు, అనురాగ్ కులకర్ణి వోకల్స్.. పాటను భావోద్వేగాలతో నింపాయి. పాటలో కనిపించే సన్నివేశాలు మనసుని కదిలించేలా వున్నాయి. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
Read also- Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం
పరదా సినిమా మంచి కథను చెప్పబోతుందని టీజర్, పాట, ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతోంది. ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ నుంచి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు రాబట్టాయి. ఈ సినిమాకి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సత్యదేవ్, నిర్మాత సురేష్ బాబు హాజరయ్యారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కి ఈ సినిమా మరెన్నో అద్భుతమైన అవకాశాల్ని తీసుకొస్తుంది. అనుపమ డిఫరెంట్ క్యారెక్టర్స్ చెయ్యడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందుకు అందరూ సపోర్టు చేయాలన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు