OG Movie: ‘ఓజీ’ మూవీ మిలియన్ డాలర్స్ పిక్ వదిలారు మేకర్స్. ఈ పిక్‌తో మరోసారి ‘ఓజీ’ ట్రెండ్‌ని షేక్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఓజీ’ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. అంతేనా, సెలబ్రిటీలు కూడా ‘ఓజీ’ మేనియాలో పడిపోయారు. ఈ మధ్య విడుదలైన సినిమాల ప్రమోషన్స్‌లో.. ఆ సినిమాల కంటే కూడా అంతా ‘ఓజీ’ నామస్మరణే చేస్తున్నారంటే ఈ సినిమా క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. మేకర్స్ ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్.. ఓ రేంజ్‌లో సినిమాపై హైప్ తీసుకొచ్చింది. బాక్సాఫీస్ బ్లడ్ బాత్‌కి రెడీ అయిపో అన్నట్లుగా హింట్ ఇచ్చేసింది. ఈ క్రమంలో మేకర్స్ వదిలిన పిక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read- Pawan Kalyan: ఒక వైపు షూటింగ్.. మరో వైపు డబ్బింగ్.. మెంటలెక్కిస్తోన్న పవర్ స్టార్!
డబ్బింగ్ పూర్తి చేసిన పవన్‌తో ఫొటో..
‘ఓజీ’ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ వర్క్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ డబ్బింగ్‌ను.. సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. పొలిటికల్‌గా బిజీగా ఉన్న పవర్ స్టార్, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఇదే పెండింగ్.. మిగతా అన్ని కార్యక్రమాలు మేకర్స్ పూర్తి చేశారు. డబ్బింగ్ కూడా పూర్తయింది కాబట్టి.. ఆ మిక్సింగ్ పనులు కూడా చకా చకా క్లియర్ చేసి, సెప్టెంబర్ 25 లేదంటే అంతకంటే ముందే ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక డబ్బింగ్ పూర్తి చేసుకున్న పవన్‌తో దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పెషల్‌గా ఓ ఫొటో దిగారు. ఇప్పుడా ఫొటోనే.. నిర్మాతలు తమ సోషల్ మీడియా వేదికగా ‘మిలియన్ డాలర్స్ పిక్’ అంటూ పోస్ట్ చేశారు. అంతే, ఒక్కసారిగా ఫ్యాన్స్ సోషల్ మీడియాను తగలెట్టేశారు.
Also Read- Local Body Elections: తెలంగాణలో స్థానిక సమరంపై అనుమానాలు!.. ఎందుకంటే?
సినిమాటిక్ తుఫాను
‘ఓజీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడొచ్చిన ఫొటో కూడా అదే వరసను ఫాలో అవుతోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉన్న విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ గర్జనకు కౌంట్‌డౌన్ మొదలైనట్టే..
Million dollar picture 🥹🔥#OG #TheyCallHimOG pic.twitter.com/AqlFrNnJcD
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు