Odela Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Odela 2 Controversy: కాంట్రవర్సీలో ‘ఓదెల 2’.. విషయం ఏమిటంటే..

Odela 2 Controversy: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల-2’ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది. ఇటీవల కులం పేరుతో ఏవైనా డైలాగ్స్ కానీ, సీన్లు కానీ ఉంటే.. వాటిపై ఆయా కులాలకు చెందిన వారు ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన బాలీవుడ్ ఫిల్మ్ ‘జాట్’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వెంటనే కులాలపై ఉన్న ఆ సన్నివేశాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడా కాంట్రవర్సీ ‘ఓదెల 2’ చిత్రానికి చుట్టుకుంది.

Also Read- Chaitu Leaks: చిరుని ఫాలో అవుతున్న చైతూ.. నెక్ట్స్ సినిమా టైటిల్ లీక్!

ఇప్పుడు బీసీ కమిషన్ చెబుతున్న సన్నివేశాలను ‘ఓదెల 2’ నుంచి వెంటనే తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కమిషన్ సూచించింది. రీసెంట్‌‌గా విడుదలైన ‘ఓదెల 2’ సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ రూ. 116 కానుక రాయించిన విషయమై జరిగిన వాద ప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై శుక్రవారం పిచ్చగుంట్ల కులానికి చెందిన పి. మల్లేష్ అనే వ్యక్తి బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపిన కమిషన్, వెంటనే ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని కోరినట్టు వెల్లడించింది.

ఈ విషయమై ఇప్పటికే హైదరాబాద్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయమై బీసీ కమిషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఒక లేఖ రాస్తూ వెంటనే దర్యాప్తు చేసి.. ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిలతో పాటు ఆ అభ్యంతరకరమైన పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి అభ్యంతరకర పదాలు ఉన్నా కూడా, ఫిలిం సెన్సార్ బోర్డు చిత్రంలోని ఆ పదాలను తొలగించకుండా, చూసీ చూడనట్టుగా వదిలేసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది.

Also Read- Akhanda 2 Thandavam: అనుమానాల మధ్య అదిరిపోయే అప్డేట్ వచ్చిందోచ్..

ఈ చిత్రం ప్రస్తుతం సినిమా థియేటర్లలో నడుస్తున్నందున ఇకపైన జరిగే చిత్ర ప్రదర్శనలో ఈ అభ్యంతరకర పదాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ డిజిపికి కూడా ఈ దీనిపై ఓ కాపీని పంపిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ కోరింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి రాహుల్ గౌలీకర్ ఆ సన్నివేశములోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా ఇందులో నాగసాధువుగా నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు