Chaitu Leaks: సుచీ లీక్స్(Suchi Leaks) తెలుసు, చిరు లీక్స్ (Chiru Leaks) తెలుసు.. కొత్తగా చైతూ లీక్స్ ఏమిటని అనుకుంటున్నారా? అవును, లీక్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లుగా, తాజాగా చైతూ తన తదుపరి సినిమా టైటిల్‌తో పాటు, తను చేస్తున్న చిత్రం ఏ జోనరో కూడా చెప్పేశారు. ఇంత వరకు మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. తాజాగా చైతూ డ్రైవ్ చేస్తూ, పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘తండేల్’ తర్వాత తను చేస్తున్న సినిమా వివరాలను చెబుతున్నారు. ఆ పక్కన కూర్చున్న వ్యక్తి డైరెక్ట్‌గా చైతూని, నువ్వు ఇలా లీక్స్ చేస్తున్నావ్.. ఇక నీకు కూడా చైతూ లీక్స్ అని పేరు వచ్చేస్తుందని సరదాగా మాట్లాడటం విశేషం.
Also Read- Akhanda 2 Thandavam: అనుమానాల మధ్య అదిరిపోయే అప్డేట్ వచ్చిందోచ్..
లీక్స్.. అనగానే సినిమా ఇండస్ట్రీ పరంగా ముందు గుర్తొచ్చేది సుచీ లీక్స్. సెలబ్రిటీల మధ్య ఉన్న లైంగిక వ్యవహారాలను రివీల్ చేస్తూ అప్పట్లో సింగర్ సుచిత్ర కొన్ని వీడియోలను లీక్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె పేరు బాగా వైరల్ అయింది కూడా. ఆ తర్వాత ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ అన్నట్లుగా ఏదో కవర్ చేశారు. సుచీ లీక్స్ పక్కన పెట్టి, చిరు లీక్స్‌లోకి వస్తే.. ఏది రహస్యంగా ఉంచాలో అది.. ఇతర ఫంక్షన్లలో మాట్లాడుతూ ప్రకటించేయడం మెగాస్టార్‌కి అలవాటుగా మారిపోయింది. ‘ఆచార్య’ నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఈ బాధ అంతా దేనికని, ముందే చెప్పి మరి ఈ మధ్య కొన్ని కీలక విషయాలను మెగాస్టార్ లీక్ చేస్తున్నారు. అలా చిరు లీక్స్ కూడా ఇండస్ట్రీలో ముద్ర పడిపోయింది.
#NagaChaitanya’s – #NC24 – BIGGEST UPDATE Loading Tomorrow Get Ready for the HUNT.
— GetsCinema (@GetsCinema) April 25, 2025
ఇప్పుడు చైతూ వంతు వచ్చింది. ‘తండేల్’ (Thandel) తర్వాత ఈ యువసామ్రాట్ ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి చేయాలనుకున్న కథ ఇదని, కానీ ఈ కథను పక్కన పెట్టి ‘విరూపాక్ష’ చేసి తనేంటో నిరూపించుకున్నానని ఇటీవల ఈ యువ దర్శకుడు తెలిపారు. ఇప్పుడు చైతూతో ఆ కథని తెరకెక్కించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడా చిత్ర వివరాలనే చైతూ లీక్ చేశారు. అసలు చైతూ తన తదుపరి సినిమా గురించి ఏం లీక్ చేశారంటే..
Also Read- Sarangapani Jathakam Review: ‘సారంగపాణి జాతకం’ సినిమా ఎలా ఉందంటే..
‘ఎన్‌సి 24’గా రూపొందనున్న ఈ చిత్రం గురించి చైతూ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నాను. ఇందులో భారీ విఎఫ్‌ఎక్స్ ఉంటాయి. నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇంత స్పాన్ ఉన్న మూవీ అయితే చేయలేదు. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిటెడ్‌గా, హ్యాపీగానూ ఉన్నాను. ఒక కంప్లీట్ అడ్వంచరస్, ట్రెజర్ హంటింగ్ మూవీగా ఉంటుంది’ అని చెప్పారు. మధ్యలో ఈ వీడియోలో ఆయన చిత్ర టైటిల్ కూడా ప్రకటించారు. కాకపోతే దానిని మ్యూట్ చేశారు. ఈ సినిమాకు ‘వృష కర్మ’ (Vrusha Karma) అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. చైతూ కూడా ఈ పేరునే పలికినట్లుగా ఈ వీడియోని తీక్షణంగా చూస్తుంటే తెలుస్తుంది. అది అసలు విషయం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు