Akhanda 2 Thandavam: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాతో వారిద్దరూ నాల్గవ సారి కొలాబరేట్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సెన్సేషనల్ సక్సెస్‌ను అందుకున్నాయి. ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న ‘అఖండ 2: తాండవం’పై కూడా ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలకు బ్రేక్ వేస్తే.. మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Also Read- Sarangapani Jathakam Review: ‘సారంగపాణి జాతకం’ సినిమా ఎలా ఉందంటే..
బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’ (Akhanda)కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నటసింహం బాలయ్యకు, దర్శకుడు బోయపాటికి మధ్య ఇష్యూస్ వచ్చాయని, బోయపాటికి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడనేలా ఈ మధ్య రూమర్స్ వినిపించాయి. అందుకు కారణం మధ్యలో హీరోయిన్ మార్పు అని కూడా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఈ సినిమాలో మొదట ప్రగ్యా జైస్వాల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. చిత్ర ఓపెనింగ్‌కు కూడా ప్రగ్యా హాజరైంది. మరి ఏమైందో ఏమోగానీ, సినిమా కొంత మేర షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమెను కాదని, సంయుక్తను హీరోయిన్‌గా ప్రకటించారు.
మరి ఈ విషయం దగ్గర చెడిందో, లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ, బోయపాటిపై బాలయ్య సీరియస్ అయ్యాడనేలా టాక్ వినబడింది. అంతేకాదు, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందో కూడా చెప్పడం కష్టమనేలా.. వద్దన్నకొద్దీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలో నిజంలేదని.. తాజా అప్డేట్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా ఆగిపోలేదని తెలిపేలా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే.. (Akhanda 2: Thandavam Latest Update)
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఆగిపోయినట్టేనా? మారుతికి ఇది పెద్ద దెబ్బే!
ఈ చిత్ర తదుపరి షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనుందట. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ అద్భుతమైన ప్రదేశాల కోసం రెక్కీ చేస్తున్నారని.. బాలకృష్ణ, ఇతర ప్రముఖ తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జార్జియా సీనరిక్ బ్యూటీ నేపథ్యంలో ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటాయని అంటున్నారు. జార్జియాలో జరుగుతున్న రెక్కీల మధ్య బోయపాటి శ్రీను తన పుట్టినరోజును జరుపుకోవడం చూస్తుంటే.. ఇది సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇక జార్జియా షూట్‌లో వేల మంది అఘోరాలతో అదిరిపోయే ఓ ఎపిసోడ్ ఉంటుందని కూడా తెలుస్తుంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ‘అఖండ 2: తాండవం’ రాబోయే దసరా స్పెషల్‌గా 25 సెప్టెంబర్, 2025న థియేటర్లలోకి రానుంది. యంగ్ హీరో ఆది పినిశెట్టి ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు