మూవీ పేరు: ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam)
విడుదల తేది: 25, ఏప్రిల్ 2025
నటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) ఒకరు. ఆయన సినిమాలకు హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉంటారు. కారణం ఆయన తీసుకునే కథలు అలా ఉంటాయి. రొటీన్‌గా కాకుండా ఎప్పుడూ కొత్తదనం నిండిన కథలతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలాంటి దర్శకుడు, ఈ మధ్య సక్సెస్ గ్రాఫ్ బాగా ఉన్నటువంటి యువ హీరో ప్రియదర్శి (Priyadarshi)తో చేసిన మరో వినూత్న ప్రయత్నమే ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచినా, రిలీజ్ విషయంలో పడిన వాయిదాలతో ఈ సినిమాపై అదిపోయింది. కేవలం మౌత్‌టాక్‌ని మాత్రమే నమ్ముకుని వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. కొన్ని వాయిదాల తర్వాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో.. (Sarangapani Jathakam Review)
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఆగిపోయినట్టేనా? మారుతికి ఇది పెద్ద దెబ్బే!
ముందుగా ఈ చిత్ర కథేంటో తెలుసుకుందాం:
హ్యందాయ్ కార్ల కంపెనీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు సారంగపాణి (ప్రియదర్శి). రెండేళ్లుగా బెస్ట్ సేల్స్‌మెన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న సారంగపాణి, అదే కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్ మైథిలీ (రూప)ని ప్రేమిస్తుంటాడు. జాతకాలపై నమ్మకం ఉన్న సారంగపాణి తన ప్రేమ విషయం మైథిలీకి చెప్పడానికి మంచి రోజు చూసుకుని బయలు దేరతాడు. అయితే ఈ నమ్మకాలేవీ లేని మైథిలి కూడా సారంగపాణిని ప్రేమిస్తుంటుంది. దీంతో సారంగపాణి ప్రేమను మైథిలీ ఓకే చెబుతుంది. అంతే, నిశ్చితార్థం అనంతరం వివాహ ఏర్పాట్లు చకచకా జరుగుతుంటాయి. అంత ఈజీగా ప్రేమ ఓకే అయినా, పెళ్లి విషయంలో చిన్న అడ్డంకు ఏర్పడుతుంది. జాతకాలను నమ్మే సారంగపాణి ఓ రోజు హస్త సాముద్రికుడైన జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్)ను కలవగా, ఆయన చేయి చూసి భవిష్యత్‌లో నువ్వు ఓ మర్డర్ చేస్తావని చెబుతాడు. అంతే సారంగపాణి మైండ్ బ్లాంక్ అవుతుంది. అసలే పెళ్లి కుదిరింది. మర్డర్ చేస్తానని జాతకంలో ఉంది.. ఇప్పుడెలా? అని ఆలోచించిన సారంగపాణి తన చిన్ననాటి మిత్రుడు చందు (వెన్నెల కిశోర్)తో కలిసి ఓ ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ వర్కవుట్ అయిందా? నిజంగా సారంగపాణి జాతకంలో ఉన్నట్లుగా మర్డర్ చేశాడా? అతనికి మైథిలీతో పెళ్లి అవుతుందా? అనే ప్రశ్నలకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సమాధానమే ఈ సినిమా.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
‘బలగం’, ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్టు’ వంటి చిత్రాలతో నటుడిగా తన సత్తా చాటుతున్న ప్రియదర్శి.. ఈ సినిమాలో సారంగపాణిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఆయన కెరీర్‌లో మరో మంచి పాత్రను ఈ సినిమాలో చేశాడు. కామెడీతో పాటు ఆయన ఈ సినిమాలో చేసిన ప్రతీది ప్రేక్షకులకు నచ్చుతుంది. అది అతని నటనకు ఉన్న టాలెంట్. హీరోయిన్ రూపకు కాస్త ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. నటిగా తనకు కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్‌పోజింగ్ లేకుండానే ఎంతో అందంగా ఆమె ఈ సినిమాలో కనిపించింది. ఇంకా ఇతర పాత్రలలో వెన్నెల కిశోర్‌కు మంచి ప్రాధాన్యమున్న పాత్ర పడింది. వైవా హర్ష, వీకే నరేష్, రూపలక్ష్మీ వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు. ఈ సినిమా సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. తెరపై ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపించింది. అలాగే వివేక్ సాగర్ సంగీతం, పిజి విందా సినిమాటోగ్రఫీ, ఎడిటంగ్ అన్ని కూడా ఈ సినిమాకు కరెక్ట్ మీటర్‌లో ఉన్నాయి. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహా, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను ఆద్యంతం ఆహ్లాదాన్ని కలిగించే విధంగా మలిచారు.
Also Read- Natural Star Nani: నాని బజ్జీలు తిను బాగుంటాయని మెగాస్టార్ చిరంజీవి అంటే..!
విశ్లేషణ:
మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలకు ఉన్న బలం ఏంటంటే, స్వచ్ఛమైన తెలుగు పదాలతో ఉండే మాటలు, ఎక్కడా ద్వంద్వార్థాలకు తావివ్వకుండా నీట్‌గా, ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తద్వారా యూత్ ఆడియెన్స్‌కి ఈ సినిమా దూరం అవుతుందని అనుకుంటారేమో. వారికి కావాల్సిన సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మధ్య సినిమాలలో నవ్వించడానికి ఏ విధమైన భాష వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చూస్తే.. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు. సినిమా చూస్తూ హాయిగా నవ్వుకోవచ్చు. కథ ముందే తెలిసిపోతూ ఉంటుంది, కానీ కామెడీ అది తెలియనివ్వదు. అలా మోహనకృష్ణ తన రచనాబలంతో ప్రేక్షకులని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. దేనిని అతిగా నమ్మకూడదు అని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం అని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. వారు చెప్పిన అంశానికి జస్టిఫై చేశారు. అలా ఇలా కాదు.. పొట్ట చెక్కలయ్యేంతగా థియేటర్లలో నవ్వులు పూయించారు. ట్రెండ్‌కు తగినట్లుగా కొన్ని సంభాషణలు ఇందులో ఉన్నాయి. అవి సినిమా చూసే వారికే తెలుస్తాయి. మొత్తంగా అయితే, ప్రియదర్శికి లక్ బాగానే కలిసొచ్చింది. అలాగే మోహనకృష్ణ ఇంద్రగంటి గత కొన్ని సినిమాలుగా చూపించలేకపోయిన మ్యాజిక్ ఈ సినిమాలో చూపించి, మరోసారి డైరెక్టర్‌గా తనని తాను నిరూపించుకున్నారు. ‘సంక్రాంతిలోనే’ కాదు.. ఈ ‘సారంగపాణి’లో కూడా మ్యాటరుంది.
ట్యాగ్‌లైన్: ‘సారంగపాణి’ దశ తిరిగింది
రేటింగ్: 3/5
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు