Natural Star About Megastar
ఎంటర్‌టైన్మెంట్

Natural Star Nani: నాని బజ్జీలు తిను బాగుంటాయని మెగాస్టార్ చిరంజీవి అంటే..!

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హిట్: ది థర్డ్ కేస్’ (Hit The 3rd Case) అనే మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మే 1న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ‘హిట్’ సిరీస్ చిత్రాలతో నాని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా కూడా పేరు పొందారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం టీమ్ అంతా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంది. నేచురల్ స్టార్ నాని ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Read Also- Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తను నిర్మించబోతున్న సినిమా విశేషాలతో పాటు, ‘కోర్టు’ (Court) సినిమా సక్సెస్ టైమ్‌లో మెగాస్టార్ తమని ఎలా గౌరవించారో కూడా నాని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మెగాస్టార్, శ్రీకాంత్ ఓదెల సినిమా అనౌన్స్‌మెంట్ టైమ్‌లో బ్లడ్ నిండిన చేతులని కలిపి ఓ పోస్టర్ విడుదల చేశాం. వారిద్దరి చేతులు బ్లడ్‌లో ముంచిన ఫొటోని నేనే తీశాను. ఫేక్ బ్లడ్‌తో అలా చేశాం. శ్రీకాంత్ వైట్ షర్ట్ తెచ్చాడు. మెగాస్టార్‌ని ఆ షర్ట్ వేసుకోండి సార్ అని నేను అడిగాను.. వెంటనే ఆయన ఓకే ప్రొడ్యూసర్ గారు అని అనగానే, మెగాస్టార్ సినిమాకు నేను ప్రొడ్యూసర్ అని గర్వంగా ఫీలయ్యాను. మెగాస్టార్ ఇంట్లో చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విషయం ఆయనే చెప్పారు.

నేను ఇటీవల నిర్మించిన ‘కోర్టు’ సినిమా చూసి, టీమ్‌ని ఆయన ఎంతగానో అభినందించారు. ఇంటికి పిలిపించుకుని వారితో సరదాగా కాసేపు గడిపారు. ఈ రోజుల్లో అలా అసలు ఊహించలేం. ఇప్పుడనే కాదు, మెగాస్టార్ ఎప్పుడూ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. నేను నటించిన సినిమా విడుదలవుతున్నప్పుడు డియర్ నాని అని మెగాస్టార్ మెసేజ్ వస్తుంది. ఇలా నా ప్రతి సినిమా విడుదల తర్వాత ఆయన మెసేజ్ పంపిస్తారు. జున్నుగాడు పుట్టినప్పుడు ఫోన్ చేసి, శుభాకాంక్షలు చెప్పారు. ఒక సైకిల్‌ని కూడా గిఫ్ట్‌గా పంపించారు. ఆ సైకిల్ ఇప్పటికీ నా ఆఫీస్‌లోనే ఉంది. నిజంగా అది నాకో అవార్డుగా భావిస్తుంటాను. మెగాస్టార్‌కు సంబంధించి ఇంకో విషయం చెప్పాలి.

Read Also- Sarangapani Jathakam: బాలయ్య సినిమా కోసం ప్రియదర్శి సినిమా బలి చేశారా?

శ్రీకాంత్, నేను కలిసి సినిమా విషయం మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లాము. అప్పుడు ఇంట్లో బజ్జీలు వేయిస్తున్నారు. నేను ఆయనతో సినిమా గురించి ముచ్చటిద్దాం అనుకునేలోపు.. ముందు బజ్జీలు తిను నాని, చాలా బాగుంటాయి అని అంటుంటే, ఆయన ముందు ఏం తింటాం.. కొంచెం కష్టంగా అనిపించింది. కానీ, ఆయన పట్టుబట్టి మరీ నాతో తినిపించారు. నిజంగా మెగాస్టార్ అంత డౌన్ టు ఎర్త్ ఉంటారని అస్సలు ఊహించలేదు. ఆయన గురించి మొదటి నుంచి తెలుసు కానీ, మరీ అంతలా కేర్ తీసుకుంటారని అప్పుడే అర్థమైంది. ఆయనతో చేస్తున్న సినిమా నేను చేస్తున్న ‘ది ప్యారడైజ్’ తర్వాతే ఉంటుంది. ‘ది ప్యారడైజ్’ పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని శ్రీకాంత్ స్టార్ట్ చేస్తారని నాని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!