NTR 31: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్న టిస్తున్న భారీ చిత్రం ‘ఎన్టీఆర్ 31’. ప్రస్తుతం సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచింది. ‘KGF’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమా స్థాయిని ఎత్తులకు తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్, ‘RRR’తో గ్లోబల్ స్టార్‌డమ్ సాధించిన ఎన్టీఆర్ కలయిక కావడంతో ఈ సినిమా పై అభిమానుల హైప్ ఆకాశాన్ని తాకుతోంది.
ఈ సినిమా బడ్జెట్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.350-360 కోట్లతో ఈ సినిమా నిర్మితమవుతుందని అంచనా. ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ స్టైల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అత్యాధునిక గ్రాఫిక్స్‌తో ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, హీరోయిన్ ఎవరన్న దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఎన్టీఆర్‌కు జోడీగా నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: Fee Reimbursement: రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం రైట్ డెసిషన్.. పేరెంట్స్ హర్షం.. ఎందుకో తెలుసా..?
అలాగే, మలయాళ నటుడు టోవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని కూడా రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే మొదలైంది. షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన పోస్టర్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరిగిందని, దీనికోసం సుమారు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని వార్తలు వచ్చాయి.
ఈ అప్డేట్‌లు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ తన ఫిట్‌నెస్‌తో ఫ్యాన్స్ కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతూ, స్లిమ్ లుక్ కోసం బరువు తగ్గుతున్నారని తెలుస్తోంది. ఆయన జిమ్ వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. టీ-షర్ట్ లేకుండా తీవ్రమైన వ్యాయామాలు చేస్తున్న ఎన్టీఆర్‌ను చూసిన ఫ్యాన్స్ ఆయన అంకితభావానికి ఫిదా అవుతున్నారు. ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ చూపిస్తున్న ఈ కమిట్‌మెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.