Kishkindhapuri: ‘కిష్కింధపురి’ సినిమాలో నో స్మోకింగ్, నో డ్రింకింగ్ సన్నివేశాలతో పాటు.. సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ వచ్చే ముఖేష్ యాడ్ కూడా లేదని అంటున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). ఆయన హీరోగా, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఆయనే స్వయంగా సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ (Mukesh Ad) ఈ సినిమాలో లేదనే విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, ఈ స్మోకింగ్ యాడ్‌పై ఆయన ఇచ్చిన వివరణ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పుకొచ్చారంటే..
Also Read- Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
ఒకే రోజు నాలుగు సినిమాలు చూస్తా..
‘‘మనం సినిమా చూడాలని థియేటర్‌కి వెళ్లి.. ఆ ఎక్స్‌పీరియెన్స్‌కు వెళ్లే ముందే.. ఆ యాడ్ రావడంతో మూడ్ అంతా పోతుంది. నేను సినిమాలకు వెళ్లిన ప్రతిసారి ఈ యాడ్ వచ్చినప్పుడు నా ఫోన్ చూసుకుంటూ ఉంటాను. సినిమా టైటిల్ కార్డ్స్ మొదలైన తర్వాత మళ్లీ ఫోన్ పక్కన పెట్టేస్తాను. నేను థియేటర్‌కి వెళ్లానంటే.. వరుసగా నాలుగు సినిమాలు చూడకుండా రాను. మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో చూసిన తర్వాతే మళ్లీ ఇంటికి వస్తాను. అన్ని సినిమాలు చూసి, అన్నీ కవర్ చేసి వస్తా.. అంత ఇంట్రెస్ట్ నాకు సినిమాలంటే. అలాంటి నాకు, నాలుగు సినిమాలలో ఆ యాడ్ చూడాలంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. నాలుగు సినిమాల్లో మొత్తంగా 8 సార్లు ప్లే అవుతుంది. సినిమా హీరోల పేర్ల కంటే, ఆ యాడే ఎక్కువ గుర్తుంటుంది. ఈ సినిమాకు అలా లేకపోవడం, కౌశిక్ అలా ఆలోచించడం చాలా హ్యాపీ. బేసిగ్గా కౌశిక్ చాలా గుడ్ బాయ్.. ఏ అలవాటూ లేదు. అందుకే ఇలా ఆలోచించి ఉంటాడు.
Also Read- Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ
అది రూల్ అంట!
సినిమాలో స్మోక్ చేస్తున్న, డ్రింక్ చేస్తున్న ఒక్క షాట్ ఉన్నా కూడా ఆ యాడ్ కంపల్సరీగా పెట్టాలంట. అది రూల్ అంట. అసలు ఈ సినిమాలో అలాంటి షాట్ లేదని తెలిసి నేనే షాకయ్యా. నేను సినిమా అంతా చూసిన తర్వాత.. ఏంటి మన సినిమాలో ఆ యాడ్ రావడం లేదేంటి? అని అడిగితే.. మన సినిమాలో అలాంటి సీన్స్ లేవు కదా సార్ అన్నాడు కౌశిక్. ఓరి నాయనో.. ఇలా కూడా సినిమా తీయవచ్చా.. అని నాకు అప్పుడే తెలిసింది. కౌశిక్ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యాను..’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పుకొస్తే.. ఈ విషయం నాకు కూడా తెలియదు అంటూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత గొప్పగా సినిమా ఎలా తీశారన్నా? అంటూ నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు.
#Kishkindhapuri @BSaiSreenivas మీరే కాదు…సినిమాకు వెళ్లే చాలా మంది
ఆ స్మోకింగ్ యాడ్ వస్తే చేసే పని అదే pic.twitter.com/79nntEWFEs— devipriya (@sairaaj44) September 6, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు