Nivetha Pethuraj: సినిమా అవకాశాలు వస్తున్నంత కాలం పెళ్లి గురించి హీరోయిన్లు ప్రస్తావించరు. ఇప్పుడప్పుడే తొందరేముంది? అని అంటుంటారు. కొందరు పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తారు. మరికొందరు పెళ్లి అయిన తర్వాత కూడా నటిస్తూనే ఉంటారు. ఈ మూడు జాబితాలకు చెందిన హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అవకాశాల సరిగా లేక, ఇక పెళ్లికి రెడీ అయింది అందాల భామ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj). తను చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. తెలుగు, తమిళ్‌లో మంచి గుర్తింపునే సొంతం చేసుకుంది. కొన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాలు కూడా ఈ భామ అకౌంట్ ఉన్నాయి. అయినా కూడా అవకాశాల కోసం వేచి చూడకుండా.. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. అలా అనుకుందో, లేదో ఓ బిజినెస్ మ్యాన్‌తో ప్రేమ, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిపోయింది.
తాజాగా నివేతా పేతురాజ్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తను ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరో కాదు.. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజ్హిత్ ఇబ్రాన్ (Rajhith Ibran). వాస్తవానికి నివేతా పేతురాజ్ పెళ్లికి సంబంధించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఎవరితోనే ప్రేమలో ఉందనేలా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా తన ప్రేమ విషయాన్ని నివేతా రివీల్ చేయలేదు. ఇప్పుడు రజ్హిత్ ఇబ్రాన్‌తో నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, పెళ్లికి సిద్ధమైంది. వ్యాపారవేత్త రజ్హిత్ ఇబ్రాన్‌తో నివేతా నిశ్చితార్థం ఇటీవలే ఒక నిరాడంబర వేడుకలో జరిగిందని, ఇందులో కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది.
Also Read- Maaman OTT: మేనల్లుడిపై మేనమామ చూపే ప్రేమ.. భార్యకు నచ్చకపోతే! ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా!
వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారని, ఈ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవడానికి నిర్ణయించుకున్నారని సమాచారం. పెళ్లి తేదీ, ఇతర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని నివేతా పేతురాజ్ ప్రకటించారు. పెళ్లి తర్వాత నివేతా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తుందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆమె పెళ్లి కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లా జరగబోతుందని కూడా ఆమె ప్రకటించింది. నివేతా పెళ్లి ప్రకటనతో అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ, నివేతా-రజ్హిత్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నివేతా చివరిగా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో నటించారు. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నివేతా పేతురాజ్ తెలుగులో ‘మెంటల్ మదిలో’ చిత్రంతో అరంగేట్రం చేసి.. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘పాగల్’ వంటి చిత్రాలతో పాటు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ శుభవార్తపై అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తనకు కాబోయే భర్తతో ఉన్న నివేతా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు