Nidhhi Agerwal
ఎంటర్‌టైన్మెంట్

Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా చేస్తే.. వేరేవి వంద సినిమాలు చేసినట్లే!

Nidhhi Agerwal: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఫస్ట్ టైమ్ ఓ చారిత్రక యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమా కోసం వేచి చూసేలా చేసింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో.. ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర టీమ్. అందులో భాగంగా చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ గురువారం మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. (Nidhhi Agerwal HHVM Interview)

‘‘హరి హర వీరమల్లు అత్యంత భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే చాలా శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవర్ స్టార్‌కు, నాకు మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. చాలా బాగుంటాయి కూడా. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు. అద్భుతం అనే మాటని రేపు చూసే ప్రేక్షకులు కూడా వాడతారు. పవర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వేరేవి వంద సినిమాలు చేసినా ఒకటే.. పవర్ స్టార్‌తో ఒక్క సినిమా చేసినా ఒకటే. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు, ఇష్టపడతారు. అందులో ఎంతో నాలెడ్జ్ ఉంది.

Also Read- Kannappa: ఇప్పటి వరకు ‘కన్నప్ప’ కలెక్ట్ చేసింది అంతేనా? భారీ లాస్ తప్పదా?

దర్శకుడు క్రిష్ నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాను పూర్తి చేశారు. వారిద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని.. ఈ తరానికి తగ్గట్టుగా పని చేస్తారు. ఎ.ఎం. రత్నం గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడి, విజయవంతంగా పూర్తి చేశారు. ఆయనలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. ఈ విషయంలో ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రాకముందు వరకు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందో? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ తీర్చేసింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ట్రైలర్‌కు వచ్చింది.

పవర్ స్టార్, రెబల్ స్టార్‌తో ఒకేసారి కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్‌గా ఉంటారేమో.. అని వారిద్దరినీ చూసినప్పుడల్లా అనిపించింది. పవర్ స్టార్ గొప్ప నటుడు. పాత్రలో ఇట్లే ఒదిగిపోతారు. రెబల్ స్టార్ చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్.

Also Read- Surekha Vani: పబ్బులో గుర్తు తెలియని వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ.. బండారం బట్టబయలు!

పంచమి పాత్ర గురించి చెప్పాలంటే, క్రిష్ నా పాత్ర గురించి, కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, అందులోనూ పవర్ స్టార్‌తో నటించే అవకాశం, రత్నం వంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. ‘పంచమి’ రూపంలో మంచి పాత్ర కూడా దక్కింది. ఇందులో భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఫైనల్‌గా ఆ సన్నివేశం చాలా బాగా వచ్చింది.

కీరవాణి సార్ గురించి చెప్పాలంటే.. పీరియడ్ సినిమాలకు పెట్టిన పేరు. పైగా ఆస్కార్ విజేత. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి సినిమా విడుదల తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో ‘తార తార, కొల్లగొట్టినాదిరో’ గీతాలు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని కథ రెడీ చేశారు. పవర్ స్టార్ ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా హరి హర వీరమల్లు ఉంటుందని చెప్పవచ్చు. పవర్ స్టార్‌తో సహా టీం అంతా ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఘన విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉంది..’’ అని నిధి తెలిపింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు