NTR Trust Event
ఎంటర్‌టైన్మెంట్

S Thaman: నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం పొందలేదు.. థమన్ ఎమోషనల్ స్పీచ్!

S Thaman: నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం పొందలేదని అన్నారు సంచలన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్. ఎక్కడ, ఎందుకు ఆయన ఈ మాట అన్నారో తెలుసా? విషయంలోకి వస్తే.. ఇటీవల ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి.. తలసేమియా బాధితుల సహాయార్థం విజయవాడతో థమన్‌తో మ్యూజికల్ నైట్‌ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి కోసం మరో కార్యక్రమానికి ఆమె పూనుకున్నారు. మే 8వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో తలసేమియా బాధితుల కోసం 3కె, 5కె, 10కె రన్‌ నిర్వహిస్తున్నామని, ఈ రన్‌లో పాల్గొని అందరూ తలసేమియా బాధితులకు అండగా ఉంటామనే భరోసా కల్పించాలని తెలిసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి థమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Also Read- Odela 2 Controversy: కాంట్రవర్సీలో ‘ఓదెల 2’.. విషయం ఏమిటంటే..

ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగిన థమన్ మ్యూజికల్ నైట్‌లో తలసేమియా సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. ఇవాళ 25 బెర్తుల కెపాసిటీతో ఈ వ్యాధి బాధితుల కోసం తలసేమియా సెంటర్‌ ప్రారంభించడం చాలా ఆనందంగా వుంది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెలా రక్తమార్పిడి జరగాలి. అది జరగకపొతే వారి ప్రాణాలకే ముప్పు. అలాగే వారు వాడే మందులు కూడా చాలా ఖర్చు ఉంటాయి. మనం చేసే గొప్ప సేవ రక్తదానమే. అందరూ విధిగా 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరుతున్నానని అన్నారు.

ట్రస్ట్‌ ద్వారా విద్య, వైద్య, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం. మరోసారి తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామనే భరోసాను కల్పిద్దాం. ఒక్క పరుగు వంద జీవితాల్లో వెలుగునిస్తుంది. నేను వాళ్ళ కోసం ఎన్నో కిలో మీటర్లు పరిగెత్తడానికి రెడీ. అందరూ ఈ రన్‌లో పాల్గొనాలని కోరుతున్నానని అన్నారు.

Also Read- Chaitu Leaks: చిరుని ఫాలో అవుతున్న చైతూ.. నెక్ట్స్ సినిమా టైటిల్ లీక్!

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. భువనేశ్వరి మేడమ్ డెడికేషన్‌తో మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ వంటి మహామహులెందరో వచ్చారు. వారి ముందు పెర్ఫామ్ చేయడం నిజంగా మెమరబుల్ ఎక్స్‌పీరియెన్స్. ఆ ఈవెంట్‌లో చెప్పినట్లుగా మేడమ్ తలసేమియా సెంటర్‌ని ప్రారంభించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విషయం నాకు చాలా హై ఇచ్చింది. నన్ను బలంగా నమ్మిన మేడమ్ థాంక్యూ. నేనెప్పుడూ ఈ గొప్ప కార్యక్రమానికి సపోర్ట్‌గా ఉంటానని మరోసారి తెలియజేస్తున్నాను.

ఒక లయన్ లేడీగా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఆవిడ చేయడం ఎందరికో స్ఫూర్తినిచ్చే అంశం. నేను ఎప్పటికీ మేడమ్‌కు సపోర్ట్‌గా ఉంటాను. ఈ కార్యక్రమం గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంత ఆనందం పొందలేదు. మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో జరిగే 3కె, 5కె, 10కె రన్‌‌లో అందరూ పాల్గొని.. తలసేమియా బాధితులకు సపోర్టుగా నిలవాలని కోరుకుంటున్నాను. నా జీవితాంతం తలిసేమియా బాధితులకు అండగా ఉంటానని థమన ఎమోషనల్ అయ్యారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు