Mahasakthi
ఎంటర్‌టైన్మెంట్

Nayanthara: ‘మూకుతి అమ్మన్ 2’‌కు పవర్ ఫుల్ తెలుగు టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘మూకుతి అమ్మన్’ (Mookuthi Amman) పార్ట్ 1 చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’ (Ammoru Thalli) పేరుతో విడుదలై, ఇక్కడ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ముఖ్యంగా నయనతార (Nayanthara) అమ్మవారిగా అద్భుతమైన నటనను కనబరిచిందనేలా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘మూకుతి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) రాబోతోంది. పార్ట్ 1కు, పార్ట్ 2కు దర్శకులు వేరువేరనే విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌కు ఆర్జే బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌ దర్శకత్వం వహిస్తే.. పార్ట్ 2కి సంచలన దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మూకుతి అమ్మన్ 2’ వివరాల్లోకి వెళితే..

Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!

‘మూకుతి అమ్మన్ 2’ తెలుగు టైటిల్‌ ఇదే..

నయనతార లీడ్ రోల్‌లో సుందర్ సి దర్శకత్వంలో తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌‌గా ‘మూకుతి అమ్మన్ 2’ నిర్మిస్తోంది. అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగు టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ, ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మూకుతి అమ్మన్ 2’ చిత్రానికి ‘మహాశక్తి’ (Mahasakthi) అనే పవర్ ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. నయనతారని అమ్మవారి రూపంలో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ డివైన్ టచ్‌తో, ఫెస్టివల్ మూడ్‌కి అనుగుణంగా ఉంది. నయనతార అమ్మవారి రూపంలో చాలా సీరియస్‌గా ఈ పోస్టర్‌లో కూర్చుని ఉన్నారు. కోవెల బయట అలా కూర్చుని, ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే.. మంచిపై దుష్ట శక్తి ప్రభావం పడిందని, ఆ ప్రభావాన్ని దూరం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు.

Also Read- Bomb Threat: మీ ఇంటిలో బాంబు పెట్టాం.. త్రిషతో పాటు ప్రముఖులకు చెన్నైలో బాంబు బెదిరింపుల కలకలం!

విజువల్ వండర్‌గా..

వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ డాక్టర్ ఇషారి కె గణేష్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ ‘మహాశక్తి’ చిత్రాన్ని భారీ స్థాయిలో.. విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు. ‘మూకుతి అమ్మన్ 2’ అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎక్జయిటింగ్ కథాంశంతో వుంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. సుందర్ సి (Sundar C) దర్శకత్వంతో పాటు ఇందులో మెయిన్ లీడ్‌లో నటిస్తున్నారు. సుందర్. సి, నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీగానే అంచనాలున్నాయి. దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగి బాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్, సింగం పులి, విచ్చు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. ‘మహాశక్తి’ ఎక్జయిటింగ్ యాక్షన్, బలమైన కథాంశం, అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భారత భాషలు, అలాగే హిందీలో కలిసి పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఎగ్జయిటింగ్ అప్డేట్స్ వస్తాయని వారు చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!