Daaku Maharaaj Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Daaku Maharaaj: ఓటీటీలో ‘దబిడి దిబిడి’ ఎప్పుడంటే..

Daaku Maharaaj: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నటసింహం బాలయ్యకు వరసగా నాల్గవ విజయాన్ని అందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఓటీటీ వీక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు రిలీజైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా ఆల్రెడీ ఓటీటీలో విడుదలై సందడి చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ‘గేమ్ చేంజర్’ను ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రెండు కూడా ఘన విజయాన్ని అందుకున్నాయి. (Daaku Maharaaj OTT Release Date)

Also Read: Krishnaveni: ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి

మరీ ముఖ్యంగా ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలపై ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపించింది.‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రీజినల్ ఫిల్మ్‌గా వచ్చి దాదాపు రూ. 300 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ‘డాకు మహారాజ్’ సినిమా కూడా విడుదలైన రెండు, మూడు రోజుల పాటు కలెక్షన్లు బాగా రాబట్టింది కానీ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందు నిలబడలేకపోయింది. అయినా కూడా బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘డాకు మహారాజ్’ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ‘డాకు మహారాజ్’ ఈ నెల 21 (ఫిబ్రవరి 21) నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుపుతూ, అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లు అందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజు’ అంటూ ఫిబ్రవరి 21న ‘డాకు మహారాజ్’ స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. అయితే ఎన్ని భాషలలో ఈ సినిమా ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంటే తెలుగులో కాకుండా ఇతర భాషలలో డబ్బింగ్ చేసి వదులుతున్నారా? లేదా? అనేది మాత్రం నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించలేదు. నెటిజన్లు కొందరు ఇదే విషయాన్ని కామెంట్స్‌లో అడుగుతున్నారు.


శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. సంగీత సంచలనం థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటివారు కీలక పాత్రలు పోషించారు. జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఫిబ్రవరి 21 నుండి ఓటీటీలో ‘దబిడి దిబిడే’ అంటూ బాలయ్య దంచుడు షూరూ కానుంది.

ఇవి కూడా చదవండి:

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Mangli Open Letter: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. అదంతా ఫేక్ ప్రచారం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు