Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. శర్వానంద్ సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 14న ఈవినింగ్ షోతో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్‌ని ఏర్పాటు చేసుకున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
Also Read- Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!
శ్రీ విష్ణు ఎంటరవ్వగానే నవ్వులే నవ్వులు
ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నాకు 16వ సంవత్సరం. 14 జనవరి, 2010న విడుదలైన ‘నమో వెంకటేశ’ సినిమాతో నా జర్నీ మొదలైంది. యాదృచ్ఛికంగా జనవరి 14న ‘నారీ నారీ నడుమ మురారి’ రిలీజ్ అవుతుంది. ‘సామజవరగమన’ ఒక మిరాకిల్. కోవిడ్ సమయంలో అసలు సినిమాలు జరుగుతాయా? లేదా? అనే సమయంలో శ్రీవిష్ణు ఒక్క కాల్‌తో సినిమా చేశారు. ఈ సినిమాలో కూడా శ్రీ విష్ణుకి ఒక మంచి క్యామియో రోల్ ఉంది. ఆయన కనిపించినంత సేపూ అంతా నవ్వుతూనే ఉంటారు. శ్రీ విష్ణు డబ్బింగ్‌లో ఇంప్రవైజ్ చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. నరేష్ అప్పుడు ఆ సినిమా అప్పుడు హిట్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత డబుల్ హిట్ అంటారు. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, డ్రామా అన్ని ఇందులో అద్భుతంగా పండాయి. సాక్షి, సంయుక్త ఇద్దరు కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు.
Also Read- Anaganaga Oka Raju: గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్.. హిలేరియస్‌గా ఉంటుందట!
మెగాస్టార్ సినిమా హిట్, బాలయ్య బాబుకు థ్యాంక్స్
రామ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. కంటెంట్ బాగుంటే గ్యారెంటీగా ఆడేస్తుందనే సీజన్ సంక్రాంతి. అది నా ఫస్ట్ సినిమా నుంచి నాకు తెలుసు. ‘నమో వెంకటేశ’ జనవరి 7వ తేదీకి షూటింగ్ పూర్తి అయింది. జనవరి 14లో సినిమా రిలీజ్ చేశాం. హౌస్ ఫుల్‌గా రన్ అయ్యింది. అప్పుడే సంక్రాంతి మ్యాజిక్ ఏంటో నాకు తెలిసింది. ఈ సినిమా విషయంలో కూడా చాలామందికి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమై ఉంటుంది. జనవరి 14న మీరు థియేటర్‌కి రావడమే ఆలస్యం నవ్వులు మొదలైపోతాయి. సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా బయటికి వచ్చారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా చాలా బాగుంది. మెగాస్టార్‌కు, అనిల్ రావిపూడికి, నిర్మాతలకి కంగ్రాట్యులేషన్స్. జనవరి 14 శర్వా సంక్రాంతి. ఇది శర్వా మూడో సంక్రాంతి అవుతుంది. ‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా’.. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’. బాలయ్య బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేము చెప్పగానే టైటిల్‌ని కూడా ఆయనే లాంచ్ చేశారు. చాలా బావుందని చెప్పారు. ఈ సినిమా టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే వుంటాయి. పండుగ ఆఫర్. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. జనవరి 14 ఈవినింగ్ 5 గంటల 49 నిమిషాలకి థియేటర్స్‌కి రండి. అందరినీ ఈ సినిమా గొప్పగా అలరిస్తుంది’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మెంబర్స్ ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

