Nara Rohit about OG
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!

OG Movie: నారా రోహిత్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ సినిమా అప్డేట్ ఇవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా! ఇదే అనుమానం మంచు మనోజ్‌కి కూడా వచ్చింది. నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోలుగా నటించిన సినిమా ‘భైరవం’(Bhairavam). ఈ సినిమా మే 30న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మెగా హీరో సాయి దుర్గ తేజ్.. చిత్రయూనిట్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నారా రోహిత్‌ని సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) ‘ఓజీ’ మూవీ అప్డేట్ చెప్పమని అడగగానే, అదేంటి బాబాయ్ అది చెప్పాల్సింది నువ్వు కదా.. రోహిత్ ఎలా చెబుతాడు? అని మంచు మనోజ్ క్వశ్చన్ చేశారు. లేదు.. రోహిత్ దగ్గరే ‘ఓజీ’ అప్డేట్ ఉంటుంది అని చెప్పగానే.. నారా రోహిత్ కలగజేసుకుని, ‘ఓజీ’ సినిమాలో నా ఫియాన్సీ (కాబోయే భార్య) కూడా ఓ పాత్రలో నటించింది అని రివీల్ చేశారు.

Also Read- Gaddar Film Awards: ఉత్తమ నటుడిగా అవార్డ్.. అల్లు అర్జున్ స్పందనిదే!

అంతే, ఒక్కసారిగా ‘ఓజీ’ పేరు వైరల్ అవుతోంది. నారా రోహిత్ ఈ విషయం చెప్పగానే మంచు మనోజ్.. ‘మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు’ అని ప్రశ్నించారు. నువ్వు అడగలేదుగా? అంటూ నారా రోహిత్ సింపుల్‌గా నవ్వేశారు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నిజంగా ఇది అందరికీ సర్‌ప్రైజింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ‘ఓజీ’కి సంబంధించి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పేరు, దర్శకుడు సుజీత్ పేరు, సంగీత దర్శకుడు థమన్ పేరు తప్పితే.. మరో ఆర్టిస్ట్, టెక్నిషీయన్ పేరు వినబడలేదు. ఎప్పుడూ చిత్ర టైటిల్, పవన్ కళ్యాణ్ పేరు తప్పితే.. మరో పేరు ట్రెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైమ్ నారా రోహిత్ ఫియాన్సీ శిరీష (Sirisha) ఇందులో నటిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతుండటం విశేషమనే చెప్పుకోవాలి. మరి ఆమె ఇందులో ఏ పాత్ర చేస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

Also Read- Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను ‘వంగ’ బెడుతున్నాడుగా!

‘ఓజీ’ విషయానికి వస్తే.. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హాస్మీ, అర్జున్ దాస్‌, ప్రకాష్‌రాజ్‌, శ్రియా రెడ్డి, హరీష్‌ ఉత్తమన్, అజయ్‌ ఘోష్‌ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కనిపించని ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ సినిమాపై ఎలాంటి అంచనాలను పెంచేసిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫంక్షన్స్‌లో కూడా ఈ పేరు ఎలా మోత మోగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాని దృష్టిలో పెట్టుకుని 2025, సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నాట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది