Allu Arjun
ఎంటర్‌టైన్మెంట్

Gaddar Film Awards: ఉత్తమ నటుడిగా అవార్డ్.. అల్లు అర్జున్ స్పందనిదే!

Gaddar Film Awards: దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2024కు గానూ ఎంపిక కాబడిన వారి వివరాలను జ్యూరీ ఛైర్ పర్సన్, నటి జయసుధ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ అవార్డులకు ఎంపికైన విజేతలను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయని, ప్రతీది పరిశీలించిన అనంతరం ఫైనల్‌గా అవార్డు పొందిన విజేతలను ప్రకటిస్తున్నట్లుగా.. గద్దర్ ఫిల్మ్ అవార్డు విజేతలను ప్రకటించారు. ఇందులో ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule) చిత్రానికి గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

Also Read- Gaddar film Awards: గద్దర్ అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ.. మిగతా విజేతలు వీరే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఇన్నాళ్లకు గద్దర్ పేరిట ఇవ్వబోతున్న మొదటి సంవత్సరపు అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘నాకు ‘పుష్ప 2’ చిత్రానికిగానూ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో మొదటి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని నాకు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా ‘పుష్ప 2’ చిత్ర దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాతలకు ఇంకా చిత్ర బృందానికి చెందుతుంది. అలాగే ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నారు. వారి నిరంతర మద్దతు నన్ను ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read- Hombale Films: సూపర్ స్టార్‌తో సినిమా సెట్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. ఇది వేరే లెవల్!

అల్లు అర్జున్ నయా రికార్డ్:

అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశారు. గద్దర్ అవార్డ్స్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో మొదటి సంవత్సరమే ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకుని అల్లు అర్జున్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. అంతకు ముందు నేషనల్ అవార్డ్స్‌లోనూ అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి రాని బెస్ట్ యాక్టర్ అవార్డును నేషనల్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్‌లోనూ.. మొదటిసారి అవార్డ్‌ను అందుకున్న నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ ఈ రికార్డులను క్రియేట్ చేయడానికి కారణం మాత్రం ‘పుష్ప’ సిరీస్ చిత్రాలే కావడం విశేషం. ముందు ముందు ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ అకౌంట్‌లో ఇంకెన్ని అవార్డులు యాడ్ కాబోతున్నాయో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ