Sandeep Reddy Vanga on PR Games
ఎంటర్‌టైన్మెంట్

Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను ‘వంగ’ బెడుతున్నాడుగా!

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్‌ని షేకాడిస్తోంది. ఇంకా చెప్పాలంటే నాలుగైదు రోజులుగా బాలీవుడ్ మీడియా అంతా ఈ పేరునే జపం చేస్తోంది. ఎందుకని అనుకుంటున్నారా? అక్కడి మీడియా మాఫియా అలాంటిది మరి. ‘యానిమల్’ (Animal) తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా చేసేందుకు సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం క్యాస్టింగ్‌ని సెలక్ట్ చేసే పనిలో ఉన్న సందీప్ రెడ్డి వంగా.. హీరోయిన్‌గా దీపికా పదుకొనే (Deepika Padukone)ని అనుకుని, ఆమెకు కథని వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కొన్ని కండీషన్స్ పెట్టిందట. ఆ కండీషన్స్ ఈ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడికి నచ్చకపోవడంతో, ఆమెను కాదని.. వెంటనే తన ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రీనే ‘స్పిరిట్’లో హీరోయిన్‌ అంటూ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అంతే, అప్పటి నుంచి బాలీవుడ్ అంతా సందీప్‌పై పగబట్టేసింది.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్ నేనే.. కట్టప్ప ఇలా షాకిచ్చాడేంటి?

బాలీవుడ్ మీడియాలో సందీప్‌పై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎప్పుడో గమనించారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడైతే దీపికాను కాదని అన్నాడో.. అప్పటి నుంచి సందీప్‌పై బాలీవుడ్ యుద్ధం ప్రకటిస్తుందని, లేనిపోని రాతలు ఆయనపై రాసి, వ్యక్తిత్వ హననానికి కూడా దిగుతారనేలా ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో ఎప్పుడో రివీల్ చేశారు. వారు చెప్పినట్లుగానే సందీప్‌పై బాలీవుడ్ మీడియా అనేక కథనాలతో, ఆయనని డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే వంగ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే ‘బాలీవుడ్‌’ని వంగబెట్టేస్తున్నాడనే చెప్పాలి. ఇప్పుడే కాదు, మొదటి సినిమా ‘కబీర్ సింగ్’ టైమ్‌లో కూడా సందీప్‌ని టార్గెట్ చేస్తూ కొందరు మీడియా వ్యక్తులు రకరకాలు వార్తలు పుట్టించారు. సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌కి బదులిస్తూ.. రక్తపాతం ఎలా ఉంటుందో.. నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానంటూ శపథం చేశాడు సందీప్ రెడ్డి.

అంతే, ‘యానిమల్’ సినిమాలో ఊచకోత ఎలా ఉంటుందో చూపించి.. తనని విమర్శించిన ఒక్కొక్కరికి నిద్ర లేకుండా చేశాడు. ఇప్పుడు కూడా తనపై చేస్తున్న, వస్తున్న విమర్శలకు సందీప్ రెడ్డి ధీటుగా స్పందిస్తున్నారు. అస్సలు తగ్గడం లేదు. ఒక ఫిల్మ్ మేకర్‌ తన కథకి ఎవరు కరెక్ట్‌గా సరిపోతారో వాళ్లని తీసుకుంటాడు. ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంది. కండీషన్స్ పెట్టి.. కథలో అది మార్చాలి, ఇది మార్చాలి అంటే ఎలా? అందులోనూ సందీప్ వంటి మెంటలోడిని ఇలాంటి విషయాల్లో అస్సలు కెలకకూడదు. కెలికింది కాక, మళ్లీ అన్‌ ప్రొఫెషనల్ అంటూ పీఆర్ స్టంట్స్ వేస్తే.. ఆయనేమైనా బెదిరే రకం అనుకుంటున్నారా? ఆయనతో పెట్టుకున్న వాళ్లందరినీ, పోయి పోయి వాడితో ఎందుకు పెట్టుకున్నామా? అని అనిపించే వరకు వదలడు. అలాంటి మెంటలోడు సందీప్ రెడ్డి వంగా.

Also Read- Lord Shiva: శివుడు స్మశానంలోనే ఎందుకు ఉంటాడు.. ఎవరికి తెలియని భయంకరమైన రహస్యాలు

అందుకే తన ఎక్స్ వేదికగా పీఆర్ స్టంట్స్ చేస్తున్న ఒక్కొక్కడికి ఇచ్చిపడేశాడు. ఒక ఆర్టిస్ట్‌కి కథ చెప్పానంటే, అది నమ్మకంతో చెబుతాం. ఆ ఆర్టిస్ట్ సెలక్ట్ అయినా, అవకపోయినా.. ఆ కథని బయటపెట్టరనే నమ్మకం ఉండబట్టే కథ చెబుతాం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుని, కథని బయటపెట్టారంటే, ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదేనా ఫెమినిజం? డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ.. సోషల్ మీడియా వేదికగా మళ్లీ మాట్లాడటానికి అవకాశం లేకుండా ఫైర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. అంతేనా, అప్పుడే వదిలేశాడనుకుంటే పొరబాటే. రాబోయే సినిమాలో ఏదో ఒక సన్నివేశం పెట్టి, తనతో గేమ్ ఆడుకోవాలనుకున్న వారిని ఆగమాగం చేసినా చేస్తాడు వంగా. ఈ విషయం సదరు పీఆర్ టీమ్ గమనించకపోతే.. బజారులో పడినట్టే. ఎందుకంటే అక్కడుంది ఆషా మాషీ వ్యక్తి కాదు.. బాలీవుడ్‌ని శాసించే వ్యక్తి. వంగబెట్టుడే..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం