Nandu: నేనంటే అందరికీ చిన్నచూపు.. ‘సైక్ సిద్ధార్థ’ వేడుకలో నందు!
Hero Nandu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Nandu: నేనంటే అందరికీ చిన్నచూపు.. ‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నందు ఎమోషనల్!

Nandu: యంగ్ హీరో నందు అలియాస్ శ్రీ నందు (Shree Nandu) తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’ (Psych Siddhartha)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందు ఎమోషనల్ అవుతూ.. కంట నీరు పెట్టుకున్నారు. ఇది పీఆర్ స్టంట్ కాదని, నేనంటే ఇండస్ట్రీలో చాలా చిన్న చూపు ఉందని చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్‌‌తో వస్తున్న ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి (Varun Reddy) దర్శకత్వం వహించారు. యామిని భాస్కర్ (Yaamini Bhaskar) హీరోయిన్‌గా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నందు చాలా వైవిధ్యమైన పాత్రను పోషించారు. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Also Read- Venu Swamy: మూఢమిలో పెళ్లి.. సమంత – రాజ్ నిడిమోరు వివాహంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

మీలాంటి యువకుడి కథ

ట్రైలర్ లాంచ్ వేడుకలో నందు మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్‌గా ఉంది. ఇదంతా ఒక టీమ్ జర్నీ. డైరెక్టర్ వరుణ్ ఆర్కిటెక్చర్.. ఆ ఫీల్డ్‌లో తనకి ఎన్నో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. తనకి ఫిలిం మేకింగ్ అంటే ప్యాషన్. అందుకే అన్నపూర్ణ స్టూడెంట్‌గా రామనాయుడులో డెబ్యూ చేస్తున్నాడు. నాకు రైటింగ్, డైరెక్షన్ మీద మొదటి నుంచీ ఆసక్తి ఉంది. కొన్ని మ్యూజిక్ వీడియోస్ కూడా డైరెక్టర్ చేశా. దర్శకుడిగా నాకో అవకావం వచ్చింది. అప్పుడు ఒక రైటర్ కోసం చూస్తుంటే వరుణ్ పరిచయమయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఒక నమ్మకం వచ్చింది. ఆ తర్వాతే ఈ సినిమా మొదలైంది. వాస్తవానికి ఈ సినిమా ఒక డెమో లాగా అనుకున్నాం. ఒక ఓటీటీ సంస్థ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఎక్కువ మందికి రీచ్ చేయాలని మేమే ఈ సినిమాని చేయాలనుకుని నిర్ణయించుకున్నాం. వరుణ్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ సినిమాకు మీలాంటి యువకుడి కథ అనే టాగ్‌లైన్ పెట్టాం. ఈ కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలాగా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. టేబుల్ ప్రాఫిట్ ఫిల్మ్‌గా విడుదల కాబోతోందీ చిత్రం. ‘పెళ్లి చూపులు’ సినిమాలో సెకండ్ లీడ్‌ చేశాను. ఆ సినిమా సక్సెస్ సమయంలోనే నాకు కూడా ఇలాంటి ఒక రోజు రావాలని బలంగా అనుకున్నాను. ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ వంటి గొప్ప సంస్థ ఈ సినిమాను తీసుకోవడం నా డ్రీమ్ నెరవేరినట్లుగా అనిపించింది.

Also Read- MP Niranjan Reddy: జాతీయ సంక్షోభంలో సింగిల్-స్క్రీన్ థియేటర్లు.. రాజ్యసభలో గళమెత్తిన ఎమ్‌పి

ఆరోజు నన్ను హగ్ చేసుకుంటారు

నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ప్రతి పాత్రకి న్యాయం చేశాను. ఏ ఒక్కరోజు కూడా నా నటన గురించి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. ఆర్‌సి‌బిలో విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్లకి విజయం రావడానికి 18 ఏళ్లు పట్టింది. నా 18 ఏళ్ల జర్నీ అయింది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ఈసారి విజయం మనదే. దయచేసి అందరూ ఈ సినిమా చూడండి. ఫస్టాఫ్ కొందరికి నచ్చుతుంది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. ఒక వేళ సినిమా నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ క్షమాపణలు చెప్తాను. ఇది పొగరుగా చెప్పడం లేదు.. చాలా వినయంగా చెప్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటా.. సినిమాలు చేస్తా. సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటా. ఈ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి. ఈ సినిమా కోసం నేను 18 కిలోలు తగ్గాను. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా కనిపించడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశాను. నా కెరీర్‌కి ఇది బంగారు బాట లాంటి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. నా జర్నీ మొదటి నుంచి అందరికీ తెలుసు. నేను ఈరోజు ఎమోషనల్ అయ్యాను. కానీ, సినిమా చూసిన తర్వాత అంతా ఎమోషనలై.. నన్ను హగ్ చేసుకునే రోజు.. డిసెంబర్ 12 అవుతుందని నేను నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..