Arjun Son of Vyjayanthi Poster
ఎంటర్‌టైన్మెంట్

Arjun Son Of Vyjayanthi: నందమూరి హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

Arjun Son Of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్ర టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడమే కాకుండా బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లో జరిగేలా చేసింది. అలాగే తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నాయల్ది’ కూడా చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచి.. సినిమాకు మరింత ఊపును ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తుంది. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ మదర్‌గా రాములమ్మ విజయశాంతి (Vijayashanti) ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మళ్లీ ఆమె నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Also Read- Mythri Movie Makers: ‘రాబిన్‌హుడ్’తో మైత్రీ బ్యానర్‌ ప్రతిష్ఠ దిగజారిందా?

ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల (Arjun Son Of Vyjayanthi Release Date) చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఆయన కనిపించని విధంగా మాస్, యాక్షన్ అవతార్‌లో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నారు. ఈ పోస్టర్, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది తెలియజేస్తుంది. ఇంతకు ముందు వచ్చిన టీజరే ఆ విషయాన్ని తెలియజేసినా, ఈ మాస్టర్ సరికొత్త అవతార్‌లో కళ్యాణ్‌ రామ్‌ని ప్రజంట్ చేస్తోంది. ఇక విడుదల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్టూడెంట్స్ పరీక్షలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 18 నాటికి అవన్నీ పూర్తయ్యి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను క్యాష్ చేసుకునేలా, ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు.

Also Read- Tribanadhari Barbarik: ఫీల్ గుడ్ సాంగ్.. కట్టప్పతో ఇలాంటి పాట అస్సలు ఊహించి ఉండరు..

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టీజర్‌తో ఈ సినిమాపై ఒక్కసారి అంచనాలు డబుల్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో రాములమ్మ విజయశాంతి ఒకప్పటి ‘కర్తవ్యం’ అవతార్‌లోనే కనిపిస్తుండటం విశేషం. ఇందులో ఆమె ఎటువంటి డూప్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్‌లో పాల్గొన్నట్లుగా ఇటీవల టీమ్ ప్రకటించింది. అలాగే, ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఇక సినిమాలు చేయను అని చెప్పిన రాములమ్మ.. ఇందులో కళ్యాణ్‌ రామ్‌కు మదర్‌గా చేసేందుకు అంగీకరించడం కూడా సినిమాపై క్రేజ్‌కు కారణం అవుతుంది. టీజర్‌లో ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఈ సినిమాకు రప్పిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ సైతం చెబుతూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, శ్రీకాంత్ విస్సా స్క్రీన్‌ప్లే బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఫిక్సయింది కాబట్టి.. ఇకపై ప్రమోషనల్ యాక్టివిటీస్‌‌తో టీమ్ దూకుడు ప్రదర్శించనుందని తెలుస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు