Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళుతోంది. ఇతర ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. తాడు కట్టి వెనక్కి లాగినట్లుగా కొన్ని సినిమాలు, ఆ సినిమాల విషయంలో ఈ సంస్థ నిర్మాతల నిర్ణయాలు తప్పిదాలుగా మారుతున్నాయి. ఒక నిర్మాణ సంస్థ నిర్మించిన, నిర్మిస్తున్న అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కానీ, ఫ్లాప్ అవ్వాలని కానీ రూల్ ఏం లేదు. హిట్, ఫ్లాప్ అనేవి వారి చేతిలో ఉండవు. కానీ, ఈ క్రమంలో ఆయా సంస్థల నిర్మాతలు తీసుకునే డెసిషన్లే సంస్థ ప్రతిష్ఠను నిలబెడుతుంటాయి. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు ఎటువంటి ఢోకా లేదు కానీ, ఈ మధ్య కొన్ని నిర్ణయాలు ఆ సంస్థ ప్రతిష్ఠకు ఆటంకంగా మారుతున్నాయి. సక్సెస్ రేషియో దృష్ట్యా.. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థని కొట్టే బ్యానర్ ప్రస్తుతం ఏదీ లేదులే కానీ, కొన్ని చిన్న, మీడియా బడ్జెట్ సినిమాల విషయంలోనే వారు కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందని, ఆ సంస్థని అభిమానించే వారు సూచనలు చేస్తున్నారు.
Also Read- Tribanadhari Barbarik: ఫీల్ గుడ్ సాంగ్.. కట్టప్పతో ఇలాంటి పాట అస్సలు ఊహించి ఉండరు..
అందుకు కారణం నితిన్, శ్రీలీలతో వారు తెరకెక్కించిన ‘రాబిన్‌హుడ్’ (Robinhood) చిత్రమే. ఈ సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్, అంచనాలను ఏర్పరచుకుంది. కారణం, దర్శకుడి బ్యాక్‌గ్రౌండ్ అలాంటిది. స్టోరీ నచ్చి మొదట ఈ సినిమాకు రష్మిగా మందన్నా (Rashmika Mandanna) కూడా ఓకే చెప్పింది. కానీ, మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె వైదొలగింది. ముందు అనుకున్నదానికన్నా భారీగా ఖర్చు అయినప్పటికీ, ఎక్కడా వెనుకాడకుండా సినిమాను పూర్తి చేశారు. అవసరం లేకున్నా, ప్రమోషన్స్‌కి పనికొస్తాడని భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ డేవిడ్ వార్నర్‌ని కూడా ఇందులో నటింపజేశారు. అయినా ఏం లాభం? సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. అంతకు ముందు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే.. హీరో నితిన్ (Nithiin)కు ఈసారి పక్కాగా హిట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆయన ప్లాప్‌ల పరంపర మాత్రం అలాగే కంటిన్యూ అయింది. ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత, మైత్రీ బ్యానర్‌లో ఇంత నాసిరకం సినిమాను ఎవరూ ఊహించి ఉండరు.
Also Read- Nandamuri Mokshagna: ఏ వారసుడి విషయంలో ఇలా అయితే జరగలేదు.. నిరాశలో ఫ్యాన్స్
ఖర్చు పరంగా ఎంతయింది, ఎన్ని కోట్లు పోయాయి అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ సంస్థ ఒక మైండ్ గేమ్‌తో సినిమాలు చేస్తూ వెళుతుంది. పెద్ద, మీడియం, చిన్న హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు, ఇలాంటి ప్లాప్స్ కాస్త వెనకడుగు వేసేలా చేస్తాయి. అదే జరిగితే, కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలని వారు నిర్ణయించుకుంటే, పరిశ్రమపై అది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే, ఎప్పుడూ సెట్స్‌పై సినిమాలు ఉండేలా చూసుకునే ఈ సంస్థ.. సినిమాలు తగ్గిస్తే ఇండస్ట్రీకి, తద్వారా ఎందరో కార్మికులకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి, ఇలాంటి సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకునే సమయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాలంటూ అభిమానులు కొందరు మైత్రీ నిర్మాతలకు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో తమ అభిమాన హీరోల చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ ప్లాప్‌లతో నిర్మాతలు డిజప్పాయింట్ అయితే, అది ఎక్కడ తమ హీరో సినిమాపై ప్రభావం పడుతుందో అని, అభిమానులు భావిస్తూ.. నిర్మాతలకు సలహాలు ఇస్తున్నారు. కొందరేమో.., ఇలాంటి చిన్న ఝలక్‌లతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా అలెర్ట్ అవుతారని కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి ‘రాబిన్‌హుడ్’ ప్రభావం మైత్రీపై ఎంత వరకు ఉంటుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు