Tribanadhari Barbarik: ‘కట్టప్ప’ సత్య రాజ్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సినిమా ‘త్రిబాణధారి బార్భరిక్’. విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ఈ చిత్రం మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజా మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘అనగా అనగా కథలా’ అంటూ సాగిన ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో, కాలేజ్ ఛైర్మన్ తీగల కృష్ణారెడ్డి చేతుల మీదుగా మేకర్స్ విడుద చేశారు. ఈ పాట సాహిత్యాన్ని ఒక్కసారి గమనిస్తే..
Also Read- Nandamuri Mokshagna: ఏ వారసుడి విషయంలో ఇలా అయితే జరగలేదు.. నిరాశలో ఫ్యాన్స్
‘చిరు ప్రాయం కుసుమాలే.. విడిపోని హృదయాలే
అనుబంధం పెనవేసే.. పసిప్రేమై కలిసేలే
చిరునవ్వై విరిసేలే.. మనసంతా మురిసేలే
అల్లరులే స్నేహాలై.. సందడిగా మారెనులే
అనగా అనగా కథలా.. మొదలైనదిలే మరలా
ఎప్పుడో తనువే విడిన బాల్యమిలా..
మనసే ఎగసే అలలా.. వయసే ఉరికే నదిలా
ఎనభై ఎగిరీ దుమికే పాతికలా..
పసితనమే రాలేక.. బదులుగ నిను పంపిందా
ఈ తాతని మార్చేలా.. ముడతల బుడతడిగ
అమ్మై ప్రేమందిస్తానే అమ్మని కాకున్నా
నాన్నై నిను నడిపించేందుకు తాతని నేనున్నా
నువ్వే నా ప్రాణం కన్నా ఎక్కువ అంటున్నా
నిన్నే నా ప్రాణం పోనీ విడువను క్షణమైనా’.. అంటూ చక్కని సాహిత్యంతో సాగిన ఈ పాట వినగానే చెవులకు ఎంతో ఇంపుగా ఉంది. ఈ పాటను స్టార్ సింగర్ కార్తిక్ ఆలపించగా.. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యం.. తాతయ్య ఎమోషన్, మనవరాలితో తాతయ్యలకు ఉండే బాండింగ్‌ను వివరిస్తూ.. ప్రతి ఒక్కరి ఫేవరేట్ లిస్ట్‌లోకి ఈ పాటను చేర్చుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా క్రేజ్‌ని ఏర్పరచుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read- Jack Trailer: ‘మిషన్ బటర్ ఫ్లై’ వర్సెస్ ‘ఆపరేషన్ రెడ్ థండర్’.. ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇక ఈ సాంగ్ విడుదల కార్యక్రమంలో ‘కట్టప్ప’ సత్య రాజ్ మాట్లాడుతూ.. టీకేఆర్ కాలేజ్‌లో ఈ పాటను విడుదల చేసినందుకు చాలా హ్యాపీ. ఇక్కడి విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే నాకు మళ్లీ అప్పటి కాలేజ్ రోజులు గుర్తొచ్చాయి. దాదాపు పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాట విడుదల కావడం హ్యాపీ. పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డికి, అందుకు సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలకు థాంక్స్. త్వరలోనే ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను అందరూ చూడండని తెలిపారు. నా మొదటి హీరోనే సత్యరాజ్ కావడం నా అదృష్టమని దర్శకుడు మోహన్ శ్రీవత్స అంటే, పాటను తన చేతుల మీదుగా రిలీజ్ చేయించిన చిత్రయూనిట్‌కు తీగల కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు