Jack Movie Still (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Jack Trailer: ‘మిషన్ బటర్ ఫ్లై’ వర్సెస్ ‘ఆపరేషన్ రెడ్ థండర్’.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Jack Trailer: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Also Read- Actress: ఆ సినిమాలో థియేటర్లో ఆడియన్స్‌ని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటూ ప్రకాశ్ రాజ్ వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో.. టెర్రరిస్ట్ లీడర్ అతావుర్ రెహమాన్ కోసం పోలీస్ వేట మొదలెట్టినట్లుగా చూపించారు. ఆ టెర్రరిస్ట్‌ను పట్టుకునే విషయంలో ఏ ఏజెన్సీ ఇన్‌వాల్వ్ అవకూడదని ప్రకాశ్ రాజ్ డైలాగ్ చెప్పిన వెంటనే.. హీరో ఎంట్రీ. మాకు తెలియకుండా ఎవడ్రా వాడిని ఎత్తుకెళ్లిపోయాడు? అనే ప్రకాశ్ రాజ్ డైలాగ్‌తో హీరో తాలుకూ పవర్‌ని పరిచయం చేశారు. ఎన్ని సార్లు చెప్పాలి సార్.. అవన్నీ ఎప్పుడో జాక్ సార్‌కి చెప్పాను అని ఓ విచారణలో ఉన్న ఖైదీ చెప్పగానే ప్రకాశ్ రాజ్ ఆశ్చర్యపోవడం గమనించవచ్చు. జాక్ సీక్రెట్ ఏజెంట్ అనే విషయం ఇక్కడ రివీల్ చేశారు. సిద్ధు ఇంటర్వ్యూ సీన్, రకరకాల గెటప్స్‌లో ఆయన కనిపిస్తుంటే.. నరేష్ తన కొడుకు కోసం పడే ఆవేదన, ఆ వెంటనే సిద్ధు పంచ్ డైలాగ్.. ఇలా సరదాగా ట్రైలర్ నడుస్తుండగా.. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎంట్రీ, ఆమెతో సిద్ధు సరసాలతో ఒక్కసారిగా ట్రైలర్ రొమాంటిక్ మూడ్‌లోకి మారిపోయింది.

Also Read- Jr NTR: ఆ మూవీ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ రాక నిజమేనా?

అయినా కంట్రీ ఇంత డేంజర్‌లో ఉందని తెలిసి కూడా ఇంత లేట్‌గా వచ్చారేంటి సార్.. పేరంటానికి వచ్చినట్టు.. అనే డైలాగ్‌తో ప్రకాశ్ రాజ్‌కు, సిద్ధుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే విషయాన్ని తెలియజేశారు. ఈ మిషన్ పేరు మాత్రం ‘మిషన్ బటర్ ఫ్లై’.. మీ మిషన్ పేరు ఏంటి అనగానే ‘ఆపరేషన్ రెడ్ థండర్’ అని ప్రకాశ్ రాజ్ చెప్పడం, వెంటనే సిద్ధు పంచ్.. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ రేంజ్‌ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అనంతరం.. నాకు ఆ ట్రక్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి.. అలాగే ఆ జాక్ సార్ కూడా కావాలి.. అని ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్, ఆ వెంటనే సిద్ధు నాన్‌స్టాప్ బూతుల డైలాగ్ సినిమా ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఇక లాస్ట్ సీన్‌లో ఒక్కసారిగా సిద్ధులో డీజే టిల్లు ఆవహించేశాడు. నాన్ స్టాప్ డైలాగ్స్‌తో తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ పంచ్‌లు పేల్చి.. ట్రైలర్‌కు ఎండ్ కార్డ్ వేశాడు.

ఓవరాల్‌గా అయితే ట్రైలర్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలను పెంచేసేలానే ఉంది. ఈ ట్రైలర్ తర్వాత ఈ సినిమా కోసం వెయిట్ చేసే వారి సంఖ్య పెరుగుతుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ‘మిషన్ బటర్ ఫ్లై వర్సెస్ ఆపరేషన రెడ్ థండర్’ అనేలా కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తూనే సిద్ధు తనదైన మ్యానరిజంతో ట్రైలర్ మొత్తం తన హ్యాండ్స్‌లోకి తీసుకున్నాడు. ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్‌గా ఉండబోతుందనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం హీరోయిన్‌‌పై ఉంటే.. ఈ ట్రైలర్‌లో మాత్రం వైష్ణవి చైతన్యకు పెద్దగా చోటు కల్పించలేదు. ఓ రెండు మూడు సీన్లు అన్నట్లుగా స్కోప్ ఇచ్చారు. ట్రైలర్ మొత్తంలో సిద్ధు డామినేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డిజె టిల్లు సిరీస్ చిత్రాల తర్వాత సిద్ధు చేస్తున్న ఈ సినిమా తన కెరీర్‌కు మరో మంచి సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచే కంటెంట్ ‘జాక్’లో ఉందనే విషయాన్ని తెలియజేయడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు